నితిన్ సినిమా వచ్చి.. ఏడాది దాటిపోయింది. రీసెంట్ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఆయన నుండి సినిమా రావడం అసాధ్యం అనుకున్నారంతా. కానీ నితిన్ మాత్రం ఈ ఏడాది ఎలాగైనా రావాల్సిందే అని అంటున్నారట. మొన్నీ మధ్యనే మొదలైన ఓ సినిమా టీమ్‌ను ఈ మేరకు అలర్ట్ చేస్తున్నారట. ఆ సినిమానే ‘అలియాస్ రుక్మిణీ’. నాని సమర్పణలో యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాను ‘దండోరా’ సినిమా ఫేమ్ మురళీకాంత్ దేవాసోత్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైన ఈ సినిమాను డిసెంబరులో థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారట. ఈ డిసెంబరులో రాకపోతే వచ్చే ఏడాది సరైన డేట్ పట్టుకోవడం అసాధ్యం అని నితిన్ అనుకుంటుండటమే కారణం అని చెబుతున్నారు. ఆ లెక్కన డిసెంబరులో రెండు, మూడో వారాలు మాత్రమే విడుదల ఖాళీగా ఉన్నాయి. మరి ఏ తేదీకి సినిమాను రెడీ చేస్తారో చూడాలి.
ఇటీవల వచ్చిన ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తే.. ఫస్ట్ లుక్‌లోనే హిట్ వైబ్ కనిపించింది. సినిమా టైటిల్ వల్లనో, కాన్సెప్ట్ వీడియో వల్లనో కానీ.. ‘అలియాస్ రుక్మిణీ’ సినిమా ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. శృంగార నవలలు రాసే కృష్ణ అనే ఓ కుర్రాడు వాటి ద్వారా కలం పేరు రుక్మిణితో పాఠకులకు దగ్గరవుతాడు. ఎవరైనా రుక్మిణి ఎవరని అడిగితే నా భార్య అని అంటాడు. ఇంతకీ రుక్మిణీ అనే అమ్మాయి కృష్ణ ఆమె నిజంగా వైఫేనా, లేక తనే అలా అనుకుంటున్నాడా అనేది సినిమా. ఒకవేళ కృష్ణ జీవితంలోకి రుక్మిణీ అనే అమ్మాయి వస్తే ఏంటి అనేది కథ అని చెప్పొచ్చు.
‘దండోరా’ లాంటి సీరియస్ కాన్సెప్ట్ సినిమాతో విమర్శకులను మెప్పించిన దర్శకుడు మురళీ కాంత్ దేవసోత్.. ఈ సినిమాకు దర్శకుడు. ఈసారి ఏకంగా రూటు మార్చి రసాత్మక వినోదం వైపు వచ్చేశారు. స్టోరీ పాయింట్ చూస్తుంటే నవ్వించడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అలాగే ఆ నవ్వులకు కాస్త రసరమ్య కవ్వింపులు కూడా ఉన్నాయి. మాములుగా అయితే ఈ కాలంలో నవలలు చదివే వాళ్ళు చాలా తగ్గిపోయారు. ఈ బ్యాక్ డ్రాప్ తీసుకోవడం చూస్తుంటే మురళికాంత్ వెనక్కు వెళ్లి 90 దశకం కథ చెబుతారు అని చెబుతున్నారు.