Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

ఏదో కారణం చేత సినిమా షూటింగ్‌ ఆగిపోతే.. ఆ తర్వాత ఆ కారణం సెట్‌రైట్‌ అయ్యేంతవరకు ఆగడం కొంతమంది విధానం. అలా చేస్తే ఆ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. అలా కాకుండా షూటింగ్‌ ఆపేయకుండా మిగిలిన సీన్స్‌, ఆల్టర్నేటివ్‌ దారులు వెతుక్కుంటూ సినిమాలు తీయడం మరో దారి. ఇప్పుడు ఈ రెండో దారిలో నడుస్తున్నారు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కిస్తున్న సినిమా ‘డ్రాగన్‌’.

Prashanth Neel

రెండు పార్టులుగా తెరకెక్కుతున్న (ఇప్పటివరకు టీమ్‌ అధికారికరంగా చెప్పలేదు అనుకోండి) ఈ సినిమాకు సంబంధించి ఓ విషయం ఇప్పుడు టాలీవుడ్‌, శాండిల్‌ వుడ్‌ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. కొనసాగింపు చిత్రాలు, యూనివర్స్‌ సినిమాలు, ఫ్రాంచైజీలు అంటూ ఈ మధ్య వరుస సినిమాలు సందడి చేస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలు అనగానే ఈ మాట బాగా వినిపిస్తోంది. కారణాలు ఏమైనా సినిమాలు ముక్కలు అవుతూనే ఉన్నాయి.

అలా ఇప్పుడు ‘డ్రాగన్‌’ సినిమాను కూడా రెండు ముక్కలు చేస్తున్నారట. అయితే ‘దేవర’ సినిమా విషయంలో, ‘సలార్‌’ సినిమా విషయంలో జరిగినట్లుగా ఈ సినిమాకు జరగకూడదని ప్రశాంత్‌ నీల్‌ ఓ నైస్‌ ప్లాన్‌ వేశారు అని చెబుతున్నారు. అదే ‘ధురంధర్‌’ ప్లాన్‌. అంటే రెండు పార్టుల మధ్య గ్యాప్‌ ఎక్కువగా ఉండకుండా చూసుకోవడం. అలా ‘డ్రాగన్‌’ సినిమా రెండు పార్టులను ఏక కాలంలో పూర్తి చేసేయాలని ప్లానన్‌ చేస్తున్నారట.

ఇలా చేస్తే.. సినిమా మీద ఆసక్తి తగ్గిపోకుండా ఉపయోగకరంగా ఉంటుంది అని చిత్ర బృందం భావిస్తోందట. ఎన్టీఆర్‌ తిరిగి సెట్స్‌పైకి వచ్చేలోపు పెండింగ్‌ సీన్స్‌ అన్నీ తీసేస్తారట. తారక్‌ సజెషన్లో తీయాల్సిన షాట్లను కూడా డూప్‌ను పెట్టి తీసేస్తున్నారు అని టాక్‌. ‘సలార్‌’ విషయంలో ప్రశాంత్‌ నీల్‌ ఈ స్టైల్‌ని బాగా వాడారని అప్పట్లో టాక్‌. ఈ విషయాలు తేలాలి అంటే మే నెల రావాల్సిందే. జూన్‌ 11న సినిమా రిలీజ్‌ అంటే అప్పుడు ప్రచారం షురూ చేస్తారు కదా.

 ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus