నిత్యా మేనన్ లిప్ లాక్ వీడియో వైరల్..!

  • December 30, 2021 / 10:57 AM IST

ఇప్పటి వరకూ నిత్యా మేనన్ గ్లామర్ షోకు దూరంగానే ఉంటూ వచ్చింది. కేవలం కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది ఈ బ్యూటీ. ‘అలా మొదలైంది’ ‘ఇష్క్’ ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ‘వంటి హిట్ చిత్రాల్లో నటించిన నిత్యా మేనన్.. ఆమె యాటిట్యూడ్ తో దర్శక నిర్మాతలను, హీరోలను ఇబ్బంది పెడుతుంది అనే ఆరోపణలను కూడా ఎదుర్కొంది. అయినప్పటికీ ఈమె అస్సలు తగ్గేది కాదు.తన పని తను చేసుకుంటూ ముందుకు సాగేది.

ఇక ఈమె బరువు గురించి కూడా చాలా మంది విమర్శించినా లైట్ తీసుకునేది. గతేడాది ‘మిషన్ మంగళ్’ చిత్రంతో బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. ఇదిలా ఉండగా.. సడెన్ గా ఈమె లిప్ లాక్ వీడియోతో అందరినీ షాక్ కు గురిచేసింది. అది కూడా హీరోతో కాదు తోటి నటితో.. వినడానికే షాకింగ్ గా ఉంది కదూ..! మేటర్ ఏంటంటే.. ‘బ్రీత్ ఇన్ టు ది షాడోస్’ అనే వెబ్ సిరీస్ లో నిత్యా మేనన్ నటిస్తుంది.

అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ లో స్ట్రీమ్ అవుతుంది. అయితే దీని కథలో భాగంగా నిత్యా మేనన్ .. లెస్బియన్ పాత్రలో కనిపించినట్టు తెలుస్తుంది. మరో నటితో నిత్యా మేనన్ లిప్ లాక్ సన్నివేశంలో పాల్గొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో ‘అ!’ అనే చిత్రంలో కూడా నిత్యా.. ఇలాంటి పాత్రనే చేసింది కానీ అందులో లిప్ లాక్ లు ఉండవు.


15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus