Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

తెలుగు సినిమాలో అందులోనూ స్టార్‌ హీరోలు నటించే మాస్‌, యాక్షన్‌ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ ఉండటం అనేది చాలా కామన్‌. మధ్యలో కొన్ని రోజులు ఐటెమ్‌ సాంగ్స్‌ ఆగిపోయినా ఆ తర్వాత ఇప్పుడు ఫుల్‌ జోష్‌లో తిరిగి ఐటెమ్‌ సాంగ్స్‌ వచ్చేశాయి. ఇలాంటి పాటల విషయంలో కొంతమంది దర్శకులు ఫేమస్‌ కూడా. అలాంటి వారిలో కూడా హరీశ్‌ శంకర్‌ ఒకరు. ఆయన సినిమా చేస్తున్నారు అంటే ఓ మంచి ఐటెమ్‌ సాంగ్‌ పక్కా అనేలా ఆయన సినిమాల్లో ప్రత్యేక గీతాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాలోనూ ఇలాంటి ఓ పాట ఉంటుందని అందరూ అనుకున్నారు.

Ustaad Bhagat Singh

దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన సినిమా అన్నా ఐటెమ్‌ సాంగ్‌ పక్కా. దీంతో కచ్చితంగా ‘ఉస్తాద్‌..’లో ఐటెమ్‌ సాంగ్‌ ఉంటుందని ఫిక్స్‌ అయిపోయారు. ఆ మధ్య దేవిశ్రీప్రసాద్‌ కూడా సినిమాలో ఓ మంచి ఐటెమ్‌ సాంగ్‌ ఉండొచ్చు అని చూచాయగా చెప్పారు. కానీ ఇప్పుడు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ మాటలు వింటుంటే అలా అనిపించడం లేదు. ‘ఈ సినిమాలో ప్ర‌త్యేక గీతాలు ఉండ‌వు. కానీ ప్ర‌తి పాట ప్ర‌త్యేకంగా ఉంటుంది’ అని ఓ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఐటెమ్‌ సాంగ్స్‌ ఆశించే ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చినట్లు అయింది.

ఇక ఈ సినిమా విడుదలకు సంబంధించి ఆసక్తికర ప్రకటన వచ్చేసింది. మార్చి 26న సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్‌ 30న సినిమాను రిలీజ్‌ చేస్తారని వార్తలొచ్చాయి. అయితే మార్చి 26న రావాల్సిన ‘ది ప్యారడైజ్‌’, మార్చి 27న రావాల్సిన ‘పెద్ది’ వాయిదా పడుతున్న నేపథ్యంలో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ను ముందుకు తీసుకొచ్చారని టాక్‌. ‘పెద్ది’ని ఏప్రిల్‌ 30న తీసుకొస్తామని చెప్పేశారు. ఇంకా ‘ప్యారడైజ్‌’ డేట్‌ చెప్పాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో ఆ డేట్‌ కూడా అనౌన్స్‌ చేస్తారని సమాచారం.

 క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus