Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Advertisement

పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రోమోలు వంటివి ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో కూడా సనాతన ధర్మం, రాజకీయాలకి సంబంధించిన సంభాషణలు ఉంటాయేమో అని అంతా భావించారు.వీటి పై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించి క్లారీటీ ఇచ్చాడు.

Ustaad Bhagat Singh

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “నిన్న రిలీజ్ చేసిన ‘ఉస్తాద్ ఆరా’ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ పాటలోని కొన్ని కొన్ని లిరిక్స్ ని తీసుకుని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఎడిట్స్ కూడా నేను చూస్తున్నాను. మీ ఆదరణకి ప్రత్యేక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని ఆధారం చేసుకుని ఆ పాటని డిజైన్ చేయడం జరిగింది. ఈ విషయం చెప్పినప్పటి నుండి కొంతమంది నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు.

అందులో ఎక్కువమంది అడిగిన ప్రశ్న.. ‘అన్నా ఈ సినిమాలో పోలిటికల్ సెటైర్లు ఉంటాయా?’ అని..! హానెస్ట్ గా చెబుతున్నాను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో ఎటువంటి పోలిటికల్ సెటైర్లు ఉండవు. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ.. ఆయన్ని అభిమానించేవారు అన్నీ పార్టీల్లోనూ ఉన్నారు. సినిమాల విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అభిమానులు వేరు.

ఆయన కూడా ‘సినిమాని సినిమాలానే చూస్తారు. ప్రకాష్ రాజ్ గారితో ఆయనకి గ్యాప్ వచ్చినప్పటికీ ‘వకీల్ సాబ్’ ‘ఓజి’ సినిమాల్లో ఆయనతో కలిసి నటించారు. ‘ఉస్తాద్..’ విషయంలో కూడా ఆయన మొదటి నుండి నాకు ఒక్కటే చెప్పారు. ఈ సినిమాలో ఎటువంటి పోలిటికల్ డైలాగులు వద్దు అని. సినిమా మూడ్ ని డిస్టర్బ్ చేయడం ఆయనకి ఇష్టం లేదు. ‘గాజు డైలాగ్ పెట్టింది ఆయన వ్యక్తిత్వాన్ని ఆధారం చేసుకుని మాత్రమే..!” అంటూ చెప్పుకొచ్చాడు.

ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus