Prasanth Varma: ప్రశాంత్ వర్మకు రూ.1000 కోట్ల ఆఫర్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా?

Advertisement

హనుమాన్ సినిమా ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్న ప్రశాంత్ వర్మ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తనకు వస్తున్న ఆఫర్లకు సంబంధించిన షాకింగ్ విషయాలను చెబుతున్నారు. తనకు 1000 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందంటూ ఈ దర్శకుడు ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు. జనవరి నెల బాక్సాఫీస్ రివ్యూను పరిశీలిస్తే హనుమాన్ మూవీ కనీవిని ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రశాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 100 కోట్ల రూపాయల ఆఫర్లు, 200 కోట్ల రూపాయల ఆఫర్లు ఇప్పటికే ఉన్నాయని తెలిపారు.

అయితే హనుమాన్ మూవీ చూసిన ఒక ఎన్నారై మాత్రం 1000 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. ఆ ఎన్నారై నిర్మాతగా సినిమా తీస్తే 1000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమేనని చెప్పారని ప్రశాంత్ వర్మ కామెంట్లు చేశారు. మన ఇతిహాసాన్ని హనుమాన్ లో చెప్పిన విధంగా చెబితే రేపు పొద్దునే 1000 కోట్ల రూపాయలు పంపిస్తానని ఆ ఎన్నారై అన్నాడని ప్రశాంత్ వర్మ కామెంట్లు చేశారు.

బడ్జెట్ కు అనుగుణంగా క్వాలిటీ చూపించామా లేదా అనేది ముఖ్యమని (Prasanth Varma) ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. మహేష్ ను గ్రాఫిక్స్ లో రాముడిగా చేసి చూసుకున్నానని చాలా బాగున్నాడని ప్రశాంత్ వర్మ అభిప్రాయపడ్డారు. హనుమాన్ సినిమాతో విజయం సాధించిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.

చిరంజీవి, మహేష్ బాబు నుంచి ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ లభిస్తే మాత్రం జై హనుమాన్ రేంజ్ మారిపోతుంది. ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యేలా ప్రశాంత్ వర్మ కెరీర్ ప్లానింగ్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రశాంత్ వర్మ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus