ఎన్టీఆర్ హీరోయిన్ వెక్కి వెక్కి ఏడ్చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. సీనియర్ హీరోయిన్ మంజరి ఫడ్నిస్(Manjari Fadnis) అందరికీ సుపరిచితమే.
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ‘శక్తి’లో కూడా నటించింది.
ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈమె నెక్స్ట్ లెవెల్ కి వెళ్లలేకపోయింది. అలాగే తెలుగు సినీ పరిశ్రమకే దూరమైంది అని చెప్పాలి.ప్రస్తుతం ఈమె హిందీ, మరాఠీ భాషల్లో రూపొందే సినిమాల్లో నటిస్తుంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో మంజరి ఫడ్నెస్ సోషల్ మీడియా షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. “2019 నుండి మా సొసైటీలో నివసిస్తున్న మైకీ(కుక్క), అందరితో ఎంతో సాధువుగా మసులుకుంటూ వచ్చేది.
కొన్ని రోజులుగా మైకీ కనిపించకపోవడంతో నేను ఆరా తీశాను. అప్పుడు నాకు ఒక భయంకరమైన నిజం తెలిసింది. బేస్‌మెంట్ ఏరియాలో కొందరు మైకీ తలపై కొట్టి, తీవ్రంగా గాయపరిచి, ఆపై గోనె సంచిలో కట్టి విసిరేశారట.(కన్నీళ్లు పెట్టుకుంటూ). మూగ జీవాల పట్ల ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడే నేరస్థులని చట్టం కఠినంగా శిక్షించాలి” అంటూ మంజరి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, జంతు ప్రేమికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతూ వాళ్ళు కూడా ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు.