‘పెద్ది'(Peddi) సినిమా రిలీజ్ అయ్యి 5 రోజులు కావస్తోంది. ప్రీమియర్ షోలతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశాడు. అతని కష్టం సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. పైగా ఇలాంటి కథని చరణ్ లాంటి స్టార్ హీరో ఓకే చేయడం అనేది కూడా చిన్న విషయం కాదు. అయితే అతని కష్టాన్ని మన టాలీవుడ్ సైతం గుర్తించకపోవడం బాధాకరం.
సినిమా రిలీజ్ అయ్యి 5 రోజులు కావస్తున్నా.. టాలీవుడ్ నుండి ఒక్క స్టార్ హీరో కూడా ట్వీట్ చేసింది లేదు అని అంతా అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన ట్విట్టర్లో ‘పెద్ది’ పై రివ్యూ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు.
తన ట్వీట్ ద్వారా అల్లు అర్జున్ స్పందిస్తూ.. ” ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ నటన మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం.చరణ్ కెరీర్ లోనే ఇది బెస్ట్ అండ్ నేచురల్, మాస్ పెర్ఫార్మెన్స్.’పెద్ది’ పాత్ర కోసం చరణ్ తన శరీరాకృతిని మార్చుకున్న తీరు అభినందించదగ్గ విషయం. నటనతోనే కాకుండా తన మార్క్ క్లాసిక్ అండ్ గ్రేస్‌ఫుల్ డాన్స్ మూవ్స్‌తో చరణ్ థియేటర్లలో దుమ్ములేపాడు.’నా సోదర సమానుడు చరణ్ పెర్ఫార్మెన్స్ చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను.
ఈ సినిమాకు వస్తున్న చప్పట్లు, ప్రశంసలకు అతను నూటికి నూరు శాతం అర్హుడు.సీనియర్ నటుడు జగపతి బాబు గారి నటన కూడా అద్భుతం. హీరోయిన్ జాన్వీ కపూర్‌కు ప్రత్యేక అభినందనలు.రామ్ చరణ్‌ను సరికొత్త ఎలివేషన్లలో, హై పెడెస్టల్‌పై చూపించడంలో దర్శకుడు వందకు వంద శాతం విజయం సాధించారు. అలాగే ‘పెద్ది’ టీమ్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను” అంటూ పేర్కొన్నాడు. బన్నీ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.