మాటల మాంత్రికుడు, ఎన్టీఆర్ కాంబినేషన్లో మూవీ

  • October 4, 2016 / 09:53 AM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. తారక్ ని డైరక్ట్ చేయాలనీ త్రివిక్రమ్ కూడా అనుకుంటున్నారు. కానీ ఇద్దరికీ టైమ్ సెట్ కాకపోవడంతో ఇంతవరకు మూవీ రాలేదు. అయితే నంద‌మూరి ఫ్యాన్స్ కల త్వరలో తీరనున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత పూరి జగన్నాథ్ డైరక్షన్లో సినిమా చేయనున్నాడు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీ గురించి  వచ్చే నెల ప్రకటన వెలువడనుంది. ఈ ఫిల్మ్ కంప్లీట్ అయినా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలిసింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న త్రివిక్రమ్.. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఇద్దరూ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రిలాక్స్ అవుతారు. అప్పుడు ఈ క్రేజీ ప్రాజక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus