టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ నటించిన ” జనతా గ్యారేజ్” సినిమా ఇక్కడ మన దేశంలోనే కాదు… పరాయి దేశం అయిన అమెరికాలో కూడా ఇరగదీస్తోంది. అయితే అదే క్రమంలో కలెక్షన్స్ విషయంలో ఈ సినిమా దూరికుపోయింది అని వేరే చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే తాజాగా అమెరికాలో ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాకి ఎలా అయినా 2 మిళియన్స్ కలెక్షన్స్ సంపాదించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.
అందులో భాగంగానే ఈ సినిమా టిక్కర్ రేట్ తగ్గించి 12 డాలర్స్ వరకు ఫిక్స్ చేసారు.. అయితే అలా చేయడం వాళ్ళ వీకెండ్ రష్ బాగా పెరిగి ఈ వారాంతరం అయ్యేసరికి దాదాపుగా 1.65 మిలియన్స్ దాకా వసూళ్లు వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే దగ్గర్లో బడా సినిమాలు ఏమి లేకపోవడంతో బయ్యర్స్ అనుకున్న రేంజ్ కలెక్షన్స్ రావడం పెద్ద కష్టం ఏమి కాదు అనే చెప్పుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో.