కొరటాల తారక్ మూవీ అలా ఉండబోతుందా?

  • May 5, 2022 / 11:53 PM IST

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ హీరోయిన్ గురించి ఇప్పటివరకు ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమాలో మొదట అలియా భట్ హీరోయిన్ గా ఎంపికైనట్టు వార్తలు ప్రచారంలోకి రాగా అలియా భట్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నానని క్లారిటీ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత అలియా భట్ నిర్ణయం మారిందని ప్రచారం జరిగింది. అదే సమయంలో కొరటాల శివ సైతం తారక్ మూవీలో అలియా భట్ ను ఎంపిక చేయలేదని క్లారిటీ ఇచ్చారు.

ఆ తర్వాత తారక్ కు జోడీగా రష్మిక మందన్న లేదా కియారా అద్వానీ నటించే అవకాశం ఉందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వీళ్లిద్దరిలో ఎవరు తారక్ కు జోడీగా నటిస్తున్నారో మేకర్స్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే ఇదే సమయంలో ఎన్టీఆర్ కు జోడీగా సాయిపల్లవి నటిస్తున్నారని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో సాయిపల్లవి కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

తారక్ సాయిపల్లవి కాంబినేషన్ లో సినిమా అంటే ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి. మే 20వ తేదీన ఈ సినిమాలో హీరోయిన్ గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆచార్య సినిమా ఎఫెక్ట్ ఈ సినిమాపై పడకుండా కొరటాల శివ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

కొరటాల శివ ఆచార్య బరువును వీలైనంత త్వరగా దించుకోవాలని అనుకుంటున్నారని బోగట్టా. కొరటాల శివతో పాటు చిరంజీవి కొంత మొత్తాన్ని సర్దుబాటు చేసి ఈ సమస్యను పరిష్కరించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాతో కొరటాల శివ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకోనుందో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus