Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Advertisement

సోషల్‌ మీడియాలో హీరోల అభిమానుల హడావుడి ఎంత జరుగుతున్నా.. ఆ హీరోలు మాత్రం పెద్దగా రియాక్ట్‌ అవ్వరు. ఫ్యాన్స్‌ ఎన్ని పోస్టులు పెడుతున్నా.. వారి నుండి ఎప్పుడో కానీ రిప్లైలు రావు. అలా వచ్చిన కొన్ని రిప్లైలు ఆ హీరో సోషల్‌ మీడియా టీమ్‌ ద్వారా వస్తాయి అని చెబుతుంటారు. ఇప్పుడు ఎలా వచ్చాయో తెలియదు కానీ ప్రముఖ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ ఎక్స్‌ అకౌంట్‌ నుండి కొన్ని షాకింగ్‌ రిప్లైలు వచ్చాయి. వాటిని చూసి ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.

NTR

నిన్న ఈవెనింగ్‌ తర్వాత నుండి ఎన్టీఆర్‌ ఎక్స్‌ అకౌంట్‌ ద్వారా కొన్ని పోస్టులకు వరుస రిప్లైలు వచ్చాయి. దీంతో షాక్‌ అవ్వడం ఫ్యాన్స్‌ వంతు అయింది. ఇదంతా ఎన్టీఆర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టోరీ వల్ల జరిగింది. నటనలోనే కాదు, వంట చేయడంలోనూ చేయి తిరిగిన ఎన్టీఆర్‌ షూటింగ్‌ల నుండి ఖాళీ దొరికితే వంట చేస్తుంటాడు. అలా ఆయ బిర్యానీ, నాటు కోడి కూర లాంటి వాటికి ఫేమస్‌ అయిపోయాడు. అలాంటిది తొలిసారి కుకీస్‌ తయారు చేశాడు. బేకింగ్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పెట్టాడు.

ఆ వీడియోను ఆయన సోషల్‌ మీడియా టీమ్‌ ఎక్స్‌లో షేర్‌ చేసింది. అలాంటి ఓ పోస్ట్‌కు ఓ అభిమాని ‘మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. రెండు కుకీస్‌ పంపించు అన్నా’ అని కామెంట్‌ చేశాడు. దానికి ఎన్టీఆర్‌ అకౌంట్‌ నుండి ‘అడ్రస్‌ పెట్టు.. ఫాస్ట్‌గా అడ్రస్‌ పెట్టు’ అంటూ బ్రహ్మానందం ఆడియోతో రిప్లై వచ్చింది. మరొక అభిమాని అదే వీడియోను ‘బిర్యానీ, నాటు కోడి ఎక్కడ టైగర్‌.. ఏంటీ కుకీలు..’ అని రాయగా.. ‘మారాయ్‌.. అన్నీ మారాయ్‌’ అంటూ ‘బాద్‌షా’లో బ్రహ్మానందం డైలాగ్‌ వీడియోను రిప్లైగా వచ్చింది.

దీంతో తారక్‌ ఏంటి ఇంత ఖాళీగా ఉన్నాడు. ఫ్యాన్స్‌ పోస్టులకు వరుస కామెంట్లు పెడుతున్నాడు అని ఆశ్చర్యపోయారు. ఏదైతే ఏముంది వీకెండ్‌లో మంచి మజా వచ్చింది తారక్‌ అభిమానులకు.

సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags