బుల్లితెరపైన సత్తా చాటిన ఎన్టీఆర్ చిత్రం

  • November 7, 2016 / 09:51 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ వెండి తెర పై రికార్డులను సృష్టించింది. అత్యంత వేగంగా 50, 100, 125 కోట్ల క్లబ్ లో చేరి తారక్ సత్తాని చాటింది. 100 రోజుల కూడా పూర్తి చేసుకోక ముందే, గత నెల 23 వ తేదీన మాటీవీ లో సాయంత్రం ప్రసారమైన ఈ చిత్రాన్ని చూసేందుకు రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు ఆసక్తికనబరిచారు. ఎటువంటి పండుగ లేకున్నా కుటుంబ సమేతంగా టీవీలకు అతుక్కుపోయారు. దీంతో ఆ సినిమా టెలికాస్ట్ సమయంలో టెలివిజన్ రేటింగ్ పాయింట్ (టీఆర్పీ) అమాంతం పెరిగింది. ఏకంగా 20. 69 కి చేరి ఎన్టీఆర్ పవర్ ని చూపించింది.

జనతా గ్యారేజ్ కంటే ఒక రోజు ముందు రోజు(అక్టోబర్ 22) జీ తెలుగులో ప్రసారమైన “అ… ఆ” 12.36 రేటింగ్ ని మాత్రమే సాధించగలిగింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ ని బీట్ చేస్తారని టీవీ వర్గాలు మొదట భావించారు. కానీ అ.. ఆ మూవీ జనతా గ్యారేజ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. టీవీ చరిత్రలో అత్యధిక రేటింగ్ సాధించిన చిత్రాల జాబితాలో జనతా గ్యారేజ్ మూడో స్థానంలో నిలిచింది. నువ్వువస్తానంటే నే వద్దంటానా (29. 5), బాహుబలి బిగినింగ్ (21.7) లు మొదట, రెండవ స్థానాల్లో ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus