NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Advertisement

జూనియర్ ఎన్టీఆర్ (NTR), కే.జి.ఎఫ్(సిరీస్) దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ మరియు పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2027 జూన్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మొదటి నుండి ఈ చిత్రానికి ‘డ్రాగన్’ (Dragon) అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరిగింది.

NTR‘s Dragon Movie

నిర్మాతలు కూడా అది నిజమే అన్నట్టు సంకేతాలు ఇచ్చారు. అయితే ఇప్పటివరకు అసలు టైటిల్ ను రివీల్ చేసింది లేదు.ఇప్పటికీ ఈ సినిమా ‘ఎన్టీఆర్ నీల్’ వర్కింగ్ టైటిల్…తోనే పిలవబడుతుంది. రేపు(మే 20న) ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈరోజు రాత్రి 11 గంటల 52 నిమిషాలకి ‘ఎన్టీఆర్ నీల్’ ప్రాజెక్టు నుండి గ్లిమ్ప్స్ విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. వారు చెప్పినట్టుగానే.. ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెబుతూ గ్లిమ్ప్స్ ను యూట్యూబ్లో రిలీజ్ చేశారు. టైటిల్ ‘డ్రాగన్’ అని కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ గ్లిమ్ప్స్ విషయానికి వస్తే ఇది.. 4 నిమిషాల 28 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఈ గ్లిమ్ప్స్ ద్వారా ‘డ్రాగన్’ ప్రపంచాన్ని పరిచయం చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

బ్రిటిషర్లు ఇండియాకి వచ్చి 250 ఏళ్ళు ఉండిపోవడానికి ముఖ్యకారణం ఓ మొక్క అని. అది హెరాయిన్ అన్నట్టు తెలిపాడు. అలాగే ‘డ్రాగన్’ లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళందరి లుక్స్ తో పాటు వాళ్ళ పాత్రల పేర్లు కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ఈ గ్లిమ్ప్స్ లో ఎన్టీఆర్ (Jr NTR) స్క్రీన్ ప్రెజన్స్ కేవలం 47 సెకన్లు మాత్రమే ఉంది. 2 నిమిషాల 59 సెకన్ల వద్ద, 3 నిమిషాల 15 సెకన్ల వద్ద, 3 నిమిషాల 35 సెకన్ల వద్ద,4 నిమిషాల 01 సెకన్ల వద్ద ఎన్టీఆర్ కనిపించాడు. షర్ట్ లెస్ గా కూడా ఎన్టీఆర్ కనిపించడం విశేషంగా చెప్పుకోవాలి.

‘దేవుడు నాకో వరం ఇచ్చాడు.. ట్రిగర్ నొక్కగానే మర్చిపోతా’ నిదరపోయినప్పుడు నా కలలోకి నేను చంపిన వాళ్ళ మొకాలు రావు.. మిగిలున్న శత్రువుల మోకాలే కనపడతాయ్. పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు’ అంటూ ఎన్టీఆర్ పలికే డైలాగ్స్ హైలెట్ గా నిలుస్తాయి. గ్లిమ్ప్స్ మొత్తం ప్యూర్ ప్రశాంత్ నీల్ స్టైల్లోనే ఉంది. బ్లాక్ డ్రెస్ లో ఎన్టీఆర్ కనిపించడం కూడా జరిగింది. రవి బసృర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, యాక్షన్ సీన్స్ అన్నీ టాప్ నాచ్ అనే విధంగా ఉన్నాయి. 2027 జూన్ 11న ‘డ్రాగన్’ థియేటర్లలోకి రాబోతుందని కూడా ఈ గ్లిమ్ప్స్ తో మరోసారి కన్ఫర్మ్ చేశారు. ఆలస్యం చేయకుండా ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ ని మీరు కూడా ఓ లుక్కేయండి :

 

బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus