రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో తన 30 వ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్ ‘ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ల పై కళ్యాణ్ రామ్, చినబాబు లు కలిసి నిర్మించనున్నారు. ఈ చిత్రం కథ పొలిటికల్ నేపధ్యంలో ఉండబోతుందని .. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ను ఈ చిత్రానికి అనుకుంటున్నారు అని.. వార్తలు వచ్చాయి.
అయితే ఎన్టీఆర్ పాత్ర … లుక్ ఈ చిత్రంలో ఎలా ఉంటాయి అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ..మొదట కార్పొరేట్ బిజినెస్మెన్ గా ఉండి… తరువాత పాలిటిక్స్ కు ఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది.గతేడాది మహేష్ బాబు కూడా ‘మహర్షి’ చిత్రంలో కార్పొరేట్ బిజినెస్మెన్ గా.. సి.ఈ.ఓ గా ఎంతో స్టైలిష్ గా కనిపించి ప్రేక్షకులను అలరించాడు. మహేష్ ను అలాంటి లుక్ లో చూడాలి అని ఎంతో మంది అప్పటి వరకూ ఎదురుచూసారు.
జేమ్స్ బాండ్ తరహా లుక్ … మహేష్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే తరహా లుక్ ట్రై చేయబోతున్నట్టు తెలుస్తుంది. గతంలో సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ లో ఎన్టీఆర్ సి.ఈ.ఓ గా నటించాడు. అయితే ఆ లుక్ మాస్ ప్రేక్షకులకి నచ్చలేదు. ఈసారి త్రివిక్రమ్ కాబట్టి ఎన్టీఆర్ ను స్టైలిష్ గా … విజిల్స్ వేయించేలా చూపిస్తాడేమో చూడాలి.
Most Recommended Video
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!