దసరా పండగ ఉన్న నెల.. ఐదు వీకెండ్లు ఉన్న నెల.. మామూలుగా ఇలానే అనుకుంటారు. కానీ సినిమా అభిమానులకు ఈ నెల చాలా ఇష్టం. ఎందుకంటే పండగ సమయంలో సినిమాలు వస్తాయి. ఎక్కువ వీకెండ్లు ఉంటే ఎక్కువ సినిమాలు వస్తాయి. కొత్త నెల ప్రారంభం అయిన నేపథ్యంలో ఈ నెలలో రాబోయే సినిమాలేంటో చూసేద్దాం. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు కలిపితే తొలి వారం నుండే వరుస సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటం గమనార్హం.
* ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’,. ఆర్కా మీడియా, కార్తికేయ నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 2న విడుదలవుతోంది.
* సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సిగ్మా’. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ ఈ సినిమాకు దర్శకుడు.
* పై రెండు సినిమాలు కాకుండా రోషన్ ‘తెల్లకాగితం’, ఆది సాయి కుమార్ ‘ఎస్.ఐ.యుగంధర్’ సినిమాలు కూడా ఈ వారంలోనే వస్తున్నాయి.
* ‘డోరతీ’, ‘ప్రేమనే ఊరిలో’, ‘తత్వం’, ‘ఇంప్యూర్’, ‘రూపాయనమః’… లాంటి సినిమాలు కూడా ఈ వారంలోనే ఉన్నాయి.
* తొలి వారంలోనే రావాల్సి ఉన్నా.. రెండో వారానికి వాయిదా పడిన సినిమా ‘ఆదర్శ కుటుంబం’. వెంకటేశ్ – త్రివిక్రమ్ – శ్రీనిధి శెట్టి కాంబోలో రూపొందిన సినిమా ఇది. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
* శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ రెండో వారంలోనే అంటే అక్టోబరు 9నే రాబోతోంది. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహిమా నంబియార్ కథానాయిక.
* రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘జైలర్ 2’. రమ్యకృష్ణ, విద్యా బాలన్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి తదితరులు అతిథి పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా అక్టోబరు 15న వస్తోంది.
* 16న విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి తర్వాత తొలిసారి జంటగా నటించిన ‘రణబాలి’ వస్తోంది. రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమా దర్శకుడు.
* ఆనంది ప్రధాన పాత్రలో గౌరీ నాయుడు తెరకెక్కించిన సినిమా ‘గరివిడి లక్ష్మి’. ఈ సినిమాను అక్టోబరు 17న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
* రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఏమో ఏమో ఇది’. ఈ సినిమాను అక్టోబరు 30న రిలీజ్ చేస్తున్నారు.
* విశ్వక్ సేన్ నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘కల్ట్’. గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్‌గా నటసి్తున్న ఈ సినిమాను ఆఖరి వారంలో రిలీజ్ చేస్తున్నారు. అదే వారంలో అనస్వర రాజన్ ‘ఇట్లు అర్జున’ కూడా వస్తోంది.