OG Collections: ‘ఓజి’ బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే?

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేటెస్ట్ మూవీ ‘ఓజి’ (OG) ఇటీవల అంటే సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ ను డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించారు. ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి రోజు పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించింది.

OG Collections

కానీ 2వ రోజు నుండి కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. మొదటి రోజు ప్రీమియర్స్ హెల్ప్ తో వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రిజిస్టర్ అయ్యాయి. కానీ వీక్ డేస్ లో డౌన్ అయ్యింది.తర్వాత దసరా హాలిడేస్ సాయంతో చాలా వరకు రికవరీ సాధించింది. అలా అని బ్రేక్ ఈవెన్ పూర్తికాలేదు. ఈ వారం కూడా నిలబడితేనే బ్రేక్ ఈవెన్ సాధ్యపడుతుంది.

ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 41.44 cr
సీడెడ్ 18.35 cr
ఉత్తరాంధ్ర 13.07 cr
ఈస్ట్ 10.90 cr
వెస్ట్ 8.01 cr
గుంటూరు 9.40 cr
కృష్ణా 8.53 cr
నెల్లూరు 3.90 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 113.6 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 14.78 cr
ఓవర్సీస్ 31.90 cr
టోటల్ వరల్డ్ వైడ్ 160.28 (షేర్)

‘ఓజి’ (OG) చిత్రానికి రూ.173 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.174 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.160.28 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.272 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.13.72 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. దసరా హాలిడేస్ వల్ల ‘ఓజి’ కి బాగానే కలిసొచ్చింది కానీ.. ‘కాంతార చాప్టర్ 1’ రేసులో ఉండటం వల్ల.. భారీగా క్యాష్ చేసుకునే అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం మరో వీకెండ్ వరకు కష్టపడాల్సిన పరిస్థితి.

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ రివ్యూ.. ‘ఇలాంటి డైలాగులు అవసరమా నీకు’

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus