నాగ శౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా టీజర్ తాజాగా యూట్యూబ్లో రిలీజ్ అయ్యింది. ఇది 1:21 నిమిషాల నిడివి కలిగి ఉంది. హీరో నాగ శౌర్య స్మార్ట్ బాయ్..ల ఎంట్రీ ఇచ్చి.. తర్వాత బ్యాడ్ బాయ్ గా మాస్ అవతార్ లోకి మారాడు. ఆ తర్వాత శ్రీదేవి విజయ్ కుమార్, సముద్రఖని, బ్రహ్మాజీ,మైమ్ గోపి వంటి వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత విలన్ మనిషి ఒకరు వచ్చి.. ‘నువ్వు బ్యాడ్ బాయ్ అని చెప్పారు.. కానీ స్మార్ట్ బాయ్ లా ఉన్నావ్’ అంటూ ఒకప్పటి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల టైపులో ఓ డైలాగ్ చెప్పాడు.
ఆ తర్వాత నాగ శౌర్య.. ‘మిర్చి’ లో ప్రభాస్..లా మొహానికి టవల్ కట్టుకుని కత్తితో అందరినీ నరుకుతున్నాడు. అటు తర్వాత సాయి కుమార్ పాత్ర ఎంట్రీ ఇచ్చి ‘గురు తపాలా.. తప్పించా’ అంటూ ‘రేసుగుర్రం’లో బ్రహ్మానందం పలికిన డైలాగ్ చెప్పడం జరిగింది. చివర్లో వెన్నెల కిషోర్ పాత్ర ఎంట్రీ ఇచ్చి.. ‘నువ్వు ఫ్లడ్ అయితే నేను వరద.. నువ్వు ఫైర్ అయితే నేను వైల్డ్ ఫైరు ఇలాంటి డైలాగులు అవసరం అంటావా నీకు’ అంటూ కామెడీ డైలాగ్ చెప్పాడు.
ఆ డైలాగ్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ కి కరెక్ట్ గా సరిపోతుంది అని చెప్పాలి.ఎందుకంటే ఆ రేంజ్ బిల్డప్ ఇచ్చారు టీజర్ కి..! నాగశౌర్యకి ప్రభాస్ లా ఇమేజ్ తెచ్చుకోవాలనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. ఈ టీజర్ లో అతని బాడీ లాంగ్వేజ్ చూస్తే.. అది మరింత రెట్టింపు అయ్యిందే తప్ప.. అతను రియాలిటీకి రాలేదు అని స్పష్టమవుతుంది.టీజర్ కి సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా రొటీన్ గా ఉంది.
కొత్తగా విన్న ఫీలింగ్ ఏమీ కలిగించదు. సరిగ్గా టీజర్ విషయంలో కూడా అంతే. ఏమాత్రం కొత్తగా ఉండదు. రొటీన్, రెగ్యులర్ అనే పదాలతోనే ఫీడ్ బ్యాక్ వస్తుంది అని అనడంలో సందేహం లేదు. కావాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి :