Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

టైటిల్‌ చూసి.. ఒక సినిమాకు ఎన్నిసార్లు సెన్సార్‌ చేస్తారు.. అది కూడా 50 కట్సా.. ఆల్‌రెడీ చేసి కొన్ని కట్స్‌ కూడా చెప్పారు.. చేసేసి రిలీజ్‌ చేశారు కదా అని మీరు అనుకోవచ్చు. మీరు చెప్పింది కరెక్టే. కానీ ఈసారి సెన్సార్‌ జరిగింది టీవీ కోసమే. మామూలు సినిమాలకు అయితే ఈ సెన్సార్‌ ఇబ్బంది ఉండేది కాదు. కానీ A సర్టిఫికెట్‌ ఉన్న సినిమా కదా. టీవీ కోసం రెండోసారి సెన్సార్‌ చేయడం తప్పనిసరి. ఇప్పుడు అందుకే రెండో ‘ధురంధర్‌’ కోసమే రెండోసారి సెన్సార్‌ చేయాల్సి వచ్చింది.

Dhurandhar

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఆదిత్య ధర్‌ తెరకెక్కించిన చిత్రం ‘ధురంధర్‌ 2’ అలియాస్‌ ‘ధురంధర్‌: ది రివేంజ్‌’. ఈ సినిమా టీవీ టెలీకాస్ట్‌కి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి సెన్సార్‌ బోర్డు ముందుకు వెళ్లింది. ఈసారి సెన్సార్‌ బోర్డు 50 కట్స్‌ను సూచించిందట. వాటిని తొలగించిన తర్వాత ‘యూ/ఏ 16+’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దీంతో సినిమా నిడివి దాదాపు 10 నిమిషాలు తగ్గినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు అక్టోబరు 18న స్టార్‌ గోల్డ్‌లో హిందీ వెర్షన్‌లో టెలీకాస్ట్‌ చేస్తారు.

ఈ సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌ కోసం సెన్సార్‌కి వెళ్లినప్పుడు ఓ 21 కట్స్‌ చెప్పారు. అప్పట్లోనే ఇన్ని కట్సా అనుకున్నారు. ఇవి కాకుండా మరికొన్ని సీన్స్‌ దాచాం అప్పుడు సినిమా టీమ్‌ చెప్పింది. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చినప్పడు అన్‌దేఖా వెర్షన్‌ అంటూ మొత్తం సీన్స్‌ పెట్టి ఓటీటీలో కావాల్సినంత హైప్‌ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు టీవీకి వచ్చేసరికి ఆ హైప్‌ బాగా తగ్గుతుంది. ఎందుకంటే ఇన్నేసి సీన్స్‌ తీసేసిన తర్వాత యాక్షన్‌ మూవీ లవర్స్‌ ఈ సినిమా చూడరు. ఓటీటీకే ప్రిఫర్‌ చేస్తారు.

ఈ సంగతి తేలాలి అంటే అక్టోబరు 18 రావాల్సిందే. ఆ రోజున సినిమా టెలీకాస్ట్‌ అయ్యాక టీఆర్పీ నెంబరు బయటకు వస్తే.. సెన్సార్‌ ఎఫెక్ట్‌ ఎంత ఉంది సినిమా మీద అనేది తేలుతుంది.

తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus