అందరికీ ఆయన రజనీకాంత్.. ప్రేమించే వాళ్లకు సూపర్ స్టార్ రజనీకాంత్.. ఆరాదించే వాళ్లకు ఆయన తలైవా రజనీకాంత్.. ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునేవారికి సింప్లిసిటీ సూపర్‌స్టార్. ఇప్పటికే పలుమార్లు ఆయన తన సింప్లిసిటీని చూపించిన రజనీకాంత్.. మరోసారి తనేంటో, తనను అలా ఎందుకు అంటారో చూపించారు. ఈ విషయంలో కొన్ని క్లారిటీలు మిస్ అయినా.. ఆయనకు సంబంధించిన లేటెస్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రజనీకాంత్ ప్రధాన పాత్రలో అశ్వత్ మరిముత్తు ‘ధర్మన్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. సిమ్రన్, రాశీ ఖన్నా, రామ్ పోతినేని ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగినప్పుడు రామ్ పోతినేని కూడా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని మైసూరులో జరుగుతోంది. ఆ షూటింగ్‌కి తలైవా ఆటోలో వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మైసూరులో సినిమా కోసం రూపొందించిన సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. రజనీకాంత్‌ని చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానులు సెట్ దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో అనుకోని విధంగా రజనీకాంత్ ఓ ఆటోలో సెట్స్ దగ్గరకు వచ్చారు. దాంతో ఫ్యాన్స్‌లో ఆనందానికి అవధులు లేవు. ఈ మొత్తం విషయాలు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే రజనీకాంత్ ఎందుకు అలా ఆటోలో సెట్‌కి వచ్చారు అనేది మాత్రం తెలియడం లేదు.
కొంతమంది సినిమా షూటింగ్‌లో భాగంగానే అలా చేశారు అని అంటుంటే.. మరికొందరు ఏ ట్రాఫిక్ కారణంగానో, లేక ఇంకేదైనా సమస్య కారణంగానే ఆటోలో రావాల్సి వచ్చి ఉంటుందని పాజిటివ్‌గా చెబుతున్నారు. అక్కడ ఏం జరిగింది అనేది చిత్రబృందం చెబితే కానీ తెలియదు. లేదంటే ఈ సినిమా విడుదలైనప్పుడు ఈ సీన్ లేకపోతే ఆటోలో రావడం నిజమని.. ఈ సీన్ ఉంటే ఆటోలో వచ్చింది షూటింగ్ కోసమే అని చెప్పొచ్చు. వెయిట్ చేద్దాం.