Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

ఒక పెద్ద హీరో పోస్ట్ పోన్‌ అయితే.. ఇండస్ట్రీలో చాలా సినిమాలకు ఇబ్బంది. ఈ విషయంలో ఏమన్నా డౌట్‌ ఉంటే ‘ఆదర్శ కుటుంబం’ సినిమా గురించి చూడండి మీకే అర్థమైపోతుంది. తొలుత అక్టోరు 2 అన్నారు, ఆ తర్వాత అక్టోబరు 9 అన్నారు. ఇప్పుడు అక్టోబరు 30 అంటున్నారు. ఆ రోజుకు సినిమా వస్తుందా అంటే.. ఏమో రిలీజ్‌కి రెండు, మూడు రోజుల ముందు ఈ విషయంలో షాక్‌ రాకుంటే ఓకే. లేదంటే షాకే.

Tollywood

ఇదంతా ప్రేక్షకుల యాంగిల్‌లో.. కానీ ఇతర సినిమాల విషయంలో ఈ షాక్‌ ఇంకా పెద్దది. ఎందుకంటే పెద్ద హీరో – పెద్ద దర్శకుడు కాంబో కదా.. మన కాస్త పక్కకు వెళ్లడం మంచిది అని కొన్ని చిన్న సినిమాలు ఇప్పటికి రెండుసార్లు వాయిదా వేసుకున్నాయి. ఫైనల్‌గా అక్టోబరు 30ని ఓకే చేసుకొని ప్రచారం షురూ చేసుకున్నాయి. కానీ ఇప్పుడు వాయిదాల నిర్మాత నాగవంశీ ‘మమ్మల్ని ఎవరూ నమ్మరు .. కానీ అక్టోబరు 30నే వస్తాం’ అని చెప్పేశారు. దీంతో ఆ చిన్న సినిమాల మళ్లీ కొత్త డేట్స్‌ వెతుక్కుంటున్నాయి.

అలా క్యాలెండర్‌తో కుస్తీ పడుతున్న సినిమాలు చూస్తే.. ‘ఇట్లు అర్జున’, ‘సమ్మర్ హాలిడేస్’ నవంబర్ 6వ తేదీని ఎంచుకున్నాయి. సాయి అనీశ్‌ రెడ్డి, అనశ్వర రాజన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘ఇట్లు అర్జున’ సినిమాకు మహేష్‌ ఉప్పాల యువ దర్శకుడు, వెంకీ కుడుముల నిర్మాత. ‘సమ్మర్‌ హాలీడేస్‌’ అయితే శ్రీకార్‌ నయన్‌ డైరెక్టర్‌. ఇక ‘చంద్రయాన్’, ‘ఏమో ఏమో ఇది’ సినిమా టీమ్‌లు అయితే కొత్త డేట్‌ కోసం ఇంకా క్యాలెండర్‌ పేజీలు తిప్పుతూనే ఉన్నాయి.

‘చంద్రయాన్‌’ సినిమాలో శివకుమార్‌, స్వప్న ప్రియదర్శిని నటించారు. శ్రీనాథ్‌ చంద్రశేఖర్‌ దర్శకుడు. ఇక ‘ఏమో ఏమో ఇది’లో రోషన్‌ మేక హీరో కాగా.. ప్రీతి ముకుందన్‌ కథానాయిక. ఈ సినిమాకు ‘హిట్‌’ సినిమాల దర్శకుడు శైలేష్‌ కొలను డైరక్టర్‌. అన్నట్లు ఈ సినిమాకూ వాయిదాల నిర్మాత నాగవంశీనే ప్రొడ్యూసర్‌.

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus