RRR: ఆ మూవీ కోసం ఆర్ఆర్ఆర్ కాంబో రిపీట్.. కానీ?

  • February 2, 2024 / 11:56 AM IST

2022 సంవత్సరంలో విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ ఏ రేంజ్ లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే చరణ్ అజయ్ దేవగణ్ కాంబో మళ్లీ రిపీట్ కానుందని తెలుస్తోంది. బుచ్చిబాబు సినిమాలో చరణ్ అజయ్ దేవగణ్ కలిసి కనిపించనున్నారని సమాచారం అందుతోంది. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే బుచ్చిబాబు స్పందిస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాను త్వరగా పూర్తి చేసి ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దిల్ రాజు, శంకర్ ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. ఈ సినిమా రైట్స్ భారీ రేటుకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం స్పెషల్ గా ఉండనున్నాయని ఈ సినిమా సాంగ్స్ విషయంలో థమన్ స్పెషల్ కేర్ తీసుకున్నారని తెలుస్తోంది. జరగండి జరగండి సాంగ్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ కానుంది. గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీకి సీక్వెల్ రాబోతుందని గతంలో వార్తలు వినిపించాయి. ఆర్ఆర్ఆర్  (RRR) సీక్వెల్ కు సంబంధించి రాబోయే రోజుల్లో జక్కన్న ప్రకటన చేస్తారేమో చూడాలి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus