Surekha Vani: హాట్ టాపిక్ గా మారిన సురేఖ వాణి లేటెస్ట్ ఫోటో!

టాలీవుడ్ సీనియర్ నటీమణుల్లో బాగా పాపులారిటీని సంపాదించుకున్న వారి లిస్ట్ తీస్తే అందులో సురేఖ వాణి కూడా ఉంటుంది. ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ అనే టీవీ షోతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన సురేఖ వాణి .. అదే షో దర్శకుడు అయిన సురేష్ తేజని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి సుప్రీత ఒక్కరే సంతానం. అయితే 2019 లో సురేఖ వాణి భర్తని కోల్పోయింది. అనారోగ్య సమస్యల వల్ల సురేష్ తేజ కన్నుమూశారు. ఆ తర్వాత ఆమె డిప్రెషన్ కు గురైంది.

కొన్నాళ్ళు సినిమాలకు కూడా దూరమైంది. ఈమె మెంటల్ గా డిస్టర్బ్ అవ్వడంతో ఈమె నటించాల్సిన చాలా సినిమా అవకాశాలను వదులుకుంది. అయితే కూతురి కోసం ఈమె త్వరగానే కోలుకుంది. ఆ తర్వాత కూతురి భవిష్యత్తుని చక్కదిద్దాలని ఈమె కోరుకుంటుంది. సుప్రీతని సినీ పరిశ్రమకి తీసుకురావడం సురేఖకి ఇష్టం లేదు. ఈ విషయాన్ని స్వయంగా సురేఖ వాణి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

అయినప్పటికీ సుప్రీతకి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆశ గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇదిలా ఉండగా.. సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి చేసే డాన్స్ వీడియోలు బాగా ఫేమస్. అలా కూడా సురేఖ వాణి పాపులర్ అయ్యింది అని చెప్పొచ్చు. 50 ఏళ్ళ వయసు మీద పడుతున్నా సురేఖ వాణి గ్లామర్ చెక్కు చెదరలేదు. ఆమె (Surekha Vani) లేటెస్ట్ ఫొటోల్లో వైన్ గ్లాస్ పట్టుకుని కనిపించింది. ఆ ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus