Allu Arjun: అల్లు అర్జున్ రికార్డ్ ను ఇప్పట్లో మరో హీరో బ్రేక్ చేయలేరుగా!

  • June 14, 2023 / 05:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ పరంగా ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ రేంజ్ పెరుగుతుండగా బన్నీ మార్కెట్ సైతం పెరుగుతోంది. హిందీలో కూడా ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న బన్నీ పుష్ప2 మూవీపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పాటు ప్రతి ప్రాజెక్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ చేరింది.

అల్లు అర్జున్ సోషల్ మీడియా ఖాతాలలో ఫాలోవర్స్ సంఖ్య 50 మిలియన్లు దాటింది. ఈ స్థాయిలో ఫాలోవర్లు ఉన్న హీరో అల్లు అర్జున్ మాత్రమే కావడం గమనార్హం. ఈ రికార్డును సొంతం చేసుకున్న తొలి సౌత్ ఇండియా హీరో అల్లు అర్జున్ కావడం గమనార్హం. బన్నీ రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బన్నీ ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లకు చేరాలని అభిమానులు భావిస్తున్నారు.

అల్లు అర్జున్ (Allu Arjun) పారితోషికం 80 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ప్రముఖ నిర్మాతలు భారీ మొత్తంలో అల్లు అర్జున్ కు అడ్వాన్స్ లు ఇస్తున్నారని తెలుస్తోంది. బన్నీ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే బన్నీ కొత్త ప్రాజెక్ట్ ఉండనుందని సమాచారం అందుతోంది. బన్నీ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.

పుష్ప2 మూవీలో రష్మిక రోల్ విభిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. బన్నీ ఏఏఏ సినిమాస్ తో బిజినెస్ పరంగా కూడా సక్సెస్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ మల్టీప్లెక్స్ ను నిర్మించనున్నారని సమాచారం అందుతోంది. సోషల్ మీడియా ఖాతాల ద్వారా బన్నీ సత్తా చాటుతుండటం గమనార్హం. బన్నీకి క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus