Prabhas: ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ఏం జరిగిందంటే?

  • September 11, 2023 / 07:20 PM IST

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ప్రభాస్ సినిమాలకు కళ్లు చెదిరే రేంజ్ లో బిజినెస్ ఆఫర్లు వస్తుండగా ప్రభాస్ క్రేజ్, రేంజ్ కు వికీపీడియా షేక్ అవుతోంది. వికీపీడియాలో సలార్ మూవీకి ఏకంగా 2,68,000కు పైగా పేజ్ వ్యూస్ వచ్చాయి.

ఈ స్థాయిలో పేజ్ వ్యూస్ రావడం సలార్ విషయంలోనే జరిగిందని తెలుస్తోంది. ప్రభాస్ సినిమా కోసం ఏ స్థాయిలో అభిమానులు ఎదురుచూస్తున్నారో సులువుగా అర్థమవుతోంది. ప్రభాస్ క్రేజ్ కు వికీపీడియా షేక్ అవుతోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ సినిమాకు దరిదాపుల్లో కాదు కదా కనీసం 60,000 కంటే ఎక్కువ పేజ్ వ్యూస్ భవిష్యత్తులో రిలీజవుతున్న మరే సినిమాకు లేవు.

ప్రభాస్ (Prabhas) ఖాతాలో రేర్ రికార్డులు చేరుతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ప్రభాస్ సలార్, సలార్2 సినిమాలను కొన్ని నెలల గ్యాప్ లోనే థియేటర్లలో విడుదల చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ సలార్ సినిమాతో మరోమారు సులువుగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్స్ లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కొత్త డైరెక్టర్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో రిస్క్ చేయవద్దని కొంతమంది నెటిజన్లు ప్రభాస్ కు సూచనలు చేస్తున్నారు. ప్రభాస్ ఇతర భాషల డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. త్వరలో ప్రభాస్ కొత్త సినిమాలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ తో సినిమాలను నిర్మించడానికి మరి కొందరు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus