Prabhas: అక్కడ కూడా సత్తా చాటుతున్న ప్రభాస్!

  • October 12, 2021 / 06:25 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ కు ఉన్న పేరు, గుర్తింపు అంతాఇంతా కాదు. బాహుబలి, బాహుబలి2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న ప్రభాస్ ఏ స్టార్ హీరోకు లేని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. వరుసగా భారీ సినిమాలలో నటిస్తూ నంబర్ 1 హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తాజాగా ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరడం గమనార్హం. బాహుబలి ది బిగినింగ్ సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తే సమయంలో వచ్చే ఎవ్వడంట ఎవ్వడంట పాట హిందీలో 500 మిలియన్ల వ్యూస్ ను అందుకుంది.

కౌన్ హైన్ వోహ్ పేరుతో హిందీ వెర్షన్ లో విడుదలైన ఈ పాట క్రియేట్ చేసిన రికార్డుల విషయంలో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. హిందీలో ఈ పాటను మౌనిమా, కైలాష్ ఖేర్ ఆలపించగా మనోజ్ ముంతాషిర్ సాహిత్యం అందించారు. బాహుబలి సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి సంగీతం కూడా కారణమనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఇప్పటికే కొత్త రికార్డులను ఖాతాలో వేసుకున్న ప్రభాస్ బాలీవుడ్ లో సైతం అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది కొన్ని నెలల గ్యాప్ లోనే ప్రభాస్ నటించిన మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. రాధేశ్యామ్ సినిమాతో ప్రభాస్ మరో పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకుంటాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus