టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత అయినటువంటి బండ్ల గణేష్‌కు(Bandla Ganesh) బిగ్ షాక్ తగిలింది. అతనికి ఏడాది పాటు జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో భాగంగా బండ్ల గణేష్ కి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది ఒంగోలు హైకోర్టు. అంతేకాదు రూ.95 లక్షల జరిమానా కూడా విధించినట్టు సమాచారం. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అవుతుంది. అసలు దీని వెనుక ఉన్న కారణం ఏంటి అంటూ సోషల్ మీడియాలో చర్చలు కూడా గట్టిగానే జరుగుతున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే… ప్రకాశం జిల్లాకు చెందిన జెట్టి వెంకటేశ్వర్లు మరియు బండ్ల గణేష్ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయట. ఇందులో భాగంగా… బండ్ల గణేష్, వెంకటేశ్వర్లకి రూ.95 లక్షలు బకాయి చెల్లించాల్సి ఉందట. దీని కోసం బండ్ల గణేష్ ను చాలా సార్లు అడిగాడట వెంకటేశ్వర్లు.. ఈ క్రమంలో తన నిర్మాణ సంస్థ ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ పేరుతో ఉన్న చెక్ ఇచ్చారట. అయితే ఆ చెక్ ను క్లియరెన్స్ కోసం వేయగా బ్యాలన్స్ లేక బౌన్స్ అయినట్టు స్పష్టమవుతోంది.
దీంతో బాధితుడు చేసేదేమీ లేక సాయం కోసం ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం, ఇరుపక్షాల వాదనలు మరియు కేసుకు సంబంధించిన అంశాలను పరిశీలించిన తర్వాత బండ్ల గణేష్‌ను దోషిగా తీర్మానించింది. అలాగే ఏడాది పాటు బండ్ల గణేష్ కి జైలు శిక్ష విధించడంతో పాటు బాధితుడికి చెల్లించాల్సిన రూ.95 లక్షలు, కోర్టు ఖర్చులతో సహా చెల్లించాలని ఆదేశించింది కోర్టు.
బండ్ల గణేష్‌కు చెక్ బౌన్స్ కేసులు ఎదురుకావడం ఇదే తొలిసారి కాదని తెలుస్తోంది. గతంలోనూ ఇలాంటి కేసుల్లో ఆయన కోర్టులు చుట్టూ తిరిగారు. జైలు శిక్ష విధించినప్పుడు పైకోర్టును ఆశ్రయించి అప్పీల్‌కు వెళ్లారు. అలా ఎస్కేప్ అవుతూ వచ్చారు. మరి ఈసారైనా ఏడాది పాటు జైలు శిక్ష అనుభవిస్తారా? లేక బాధితుడికి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించి.. కేసు వెనక్కి తీసుకునేలా చేసి బయటపడతారా? అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు ఇప్పటివరకు బండ్ల గణేష్ పై 50కి పైగా చీటింగ్ కేసులు నమోదయ్యాయట. అయినప్పటికీ తనకి ఉన్న రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఎస్కేప్ అవుతూ వచ్చారని స్పష్టమవుతుంది.