Narappa Movie: ‘ఓ నారప్ప’ .. హుషారెత్తించావ్ అప్ప..!

  • July 16, 2021 / 09:00 PM IST

తమిళంలో సూపర్ హిట్ అయిన ధనుష్ ‘అసురన్’ చిత్రం తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘నారప్ప’ పేరుతో తెలుగులో రీమేక్ అవుతున్న ఈ చిత్రం ఈ నెల 20న(జూలై 20న) అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదల కాబోతుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా ఈ మధ్యనే ట్రైలర్ ను అలాగే ఫస్ట్ సింగిల్ ను కూడా విడుదల చేశారు. ఆ రెండిటికీ మంచి స్పందన లభించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు.

వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా సెకండ్ సింగిల్ ను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ‘ఓ నారప్ప’ అంటూ సాగే ఈ పాటకి మణిశర్మ బాణీలు బాగున్నాయి.అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా …. ధనుంజయ్, వరద ఈ పాటని చాలా చక్కగా పాడారు.

క్లాస్ అండ్ మాస్ ఆడియెన్స్ ను కూడా హుషారెత్తించే విధంగానే ఈ పాట ఉంది. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈ పాట ఉండబోతుందని స్పష్టమవుతుంది. ఇక ‘సురేశ్ ప్రొడక్షన్స్’ మరియు ‘వి క్రియేషన్స్’ సంస్థల పై సురేష్ బాబు మరియు కలైపులి ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇంకెందుకు ఆలస్యం ఈ పాటని మీరు కూడా ఓ సారి వినెయ్యండి :

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus