‘పడి పడి లేచే మనసు’ ప్రమోషన్ పెంచుతున్నారు

  • December 12, 2018 / 05:08 PM IST

‘అందాల రాక్షసి’ ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ‘లై’ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులని ఆకర్షించాడు డైరెక్టర్ హను రాఘవపూడి. తాజాగా హను రాఘవపూడి డైరెక్షన్లో వస్తున్న తాజా చిత్రం ‘ పడి పడి లేచే మనసు’. శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్, పాటలకి మంచి స్పందన లభించింది.

ఇక ఈ చిత్ర ట్రైలర్ ను డిసెంబర్ 14 న విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 21 న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అయితే అదే రోజున ‘అంతరిక్షం’ ‘కే.జి.ఎఫ్’ వంటి చిత్రాలు కూడా రిలీజ్ కాబోతుండడంతో రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రమోషన్ల జోరు పెంచింది చిత్ర యూనిట్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus