కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మలయాళ సినీ పరిశ్రమ నుండి స్టార్ హీరో మమ్ముట్టీ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే తమిళ నుండి ఆర్ మాధవన్ కూడా పద్మ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక టాలీవుడ్(Tollywood) నుండి సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్..లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారి చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ అవార్డులను అందుకున్నారు.
రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్..లు 4 దశాబ్దాల నుండి తెలుగు సినీ పరిశ్రమకి చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారిని పద్మశ్రీ అవార్డులకి ఎంపిక చేయడం జరిగింది.ఈ 2వ విడత కార్యక్రమంలో మొత్తంగా 65 మందికి పద్మ పురస్కారాలను అందజేశారు ద్రౌపదీ ముర్ము. వీటిలో 2 పద్మ విభూషణ్ పురస్కారాలు, 7 పద్మభూషణ్ పురస్కారాలు, 56 పద్మశ్రీ పురస్కారాలు ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. మొదటి విడత 66 మంది సెలబ్రిటీలకి పద్మ అవార్డులు అందజేసింది కేంద్ర ప్రభుత్వం.
ఈరోజు జరిగిన 2వ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవంతో ఈ ఏడాదికి సంబంధించిన పంపిణీ ప్రక్రియ పూర్తయింది అని చెప్పొచ్చు. ఇందులో ఇద్దరు టాలీవుడ్ సీనియర్లు అవార్డులు అందుకోవడం అనేది విశేషంగానే చెప్పుకోవాలి. వీరిని టాలీవుడ్..కి చెందిన కొంతమంది సెలబ్రిటీలు అభినందిస్తూ సామాజిక మాధమల్లో స్పందిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా నెటిజెన్లు వీరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు అలాగే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.