బిగ్ బాస్ సీజన్7 విజేత పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని పేద ప్రజలకు, రైతులకు సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ కు వచ్చిన ఫ్రైజ్ మనీలో టాక్స్ లు పోగా వచ్చిన మొత్తం 20 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉందని ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్లు చెబుతున్నారు. బిగ్ బాస్ షోలో మొదట నాకు ఇచ్చిన మొక్క నేను బిగ్ బాస్ జైలులో ఉన్న సమయంలో డ్యామేజ్ అయిందని ప్రశాంత్ పేర్కొన్నారు.
ఆ మొక్క విషయంలో ఎవరూ కేర్ తీసుకోకపోవడంతో మొక్క చనిపోయిందని ఆయన వెల్లడించారు. అయితే ఆ చనిపోయిన మొక్క మట్టిని దాచి నాగ్ (Nagarjuna) సార్ కు ఇవ్వగా ఆయన తన ఇంట్లో మొక్కలపై ఆ మట్టిని చల్లుతానని చెప్పారని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు. అయితే నాగ్ సార్ ఆ మట్టిని మొక్కలపై చల్లారో లేదో ఆ తర్వాత ఎప్పుడూ అడగలేదని ఆయన కామెంట్లు చేశారు. బిగ్ బాస్ హౌస్ బ్రతుకును నేర్పిస్తుందని పల్లవి ప్రశాంత్ అన్నారు.
స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అంటే అభిమానమని బన్నీని కలవాలని ఉందని కొంతమందిని అడిగినా వాళ్ల నుంచి సహాయం లభించలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా అల్లు అర్జున్ ను కలుస్తానని పల్లవి ప్రశాంత్ వెల్లడించారు. బిగ్ బాస్ హౌస్ ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. అసెంబ్లీకి, పార్లమెంట్ కు వెళ్లే ఛాన్స్ వస్తే వదులుకోనని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు.
నా దగ్గర ఎక్కువగా డబ్బులు లేవని ఆయన అన్నారు. నేను పెయిడ్ ప్రమోషన్స్ చేయించుకోలేనని పల్లవి ప్రశాంత్ అభిప్రాయపడ్డారు. పల్లవి ప్రశాంత్ రాజకీయాలపై ఫోకస్ పెడుతుండగా రాబోయే రోజుల్లో రాజకీయాల్లో కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాలి. పల్లవి ప్రశాంత్ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే లాంగ్ టర్మ్ లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!