Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Advertisement

తిరువీర్ ప్రతి సినిమాకి తన మార్కెట్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. గతంలో ఇతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించినప్పటికీ.. ‘మసూద’ తో హీరోగా మంచి బ్రేక్ వచ్చింది.

Papam Prathap

అటు తర్వాత చేసిన ‘పరేషాన్’ కమర్షియల్ గా అంత ఆడకపోయినా.. తన కంటెంట్ సెలక్షన్ పై మాత్రం నమ్మకం పెరిగేలా చేసింది. ఇక ‘ది ప్రీ వెడ్డింగ్’ షో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

అతని లేటెస్ట్ మూవీ ‘పాపం ప్రతాప్’ ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది. టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించాయి. మేకర్స్ ప్రమోషన్స్ ను అగ్రెసివ్ గా నిర్వహించారు. అయితే మొదటి రోజు ఈ సినిమాకి యావరేజ్ రిపోర్ట్స్ మాత్రమే వచ్చాయి. అయినప్పటికీ మొదటి మంచి ఓపెనింగ్స్ తీసుకుంది. రెండో రోజు కూడా పర్వాలేదు అనిపించాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

తెలంగాణ  0.48 cr
సీడెడ్ 0.06 cr
ఆంధ్ర(టోటల్)  0.46 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.0 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.10 cr
వరల్డ్ వైడ్ టోటల్ 1.10 cr

‘పాపం ప్రతాప్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.2.75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.1.1 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.9 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఆదివారం కూడా ఇదే రేంజ్లో కలెక్ట్ చేసి.. వీక్ డేస్ లో స్టడీగా కలెక్ట్ చేస్తే.. బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో.. !

బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus