Pawan, Balayya: చరణ్ కు చెప్పినట్టే బాలయ్య పవన్ కు కూడా చెబుతారా?

స్టార్ హీరో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోతో ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పిస్తుండగా ప్రభాస్ గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ ఎపిసోడ్ వల్ల యాప్ క్రాష్ అయిందంటే ఈ ఎపిసోడ్ ఏ రేంజ్ లో మెప్పించిందో సులువుగానే అర్థమవుతుంది. ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్2 ఈ నెల 6వ తేదీన రిలీజ్ కానుండగా ఆ ఎపిసోడ్ కోసం కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ ఎపిసోడ్ లో అయినా ప్రభాస్ కు సంబంధించిన కొత్త విషయాలు రివీల్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్, గోపీచంద్ అతిథులుగా హాజరైన ఈ ఎపిసోడ్ కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే బాలయ్య పవన్ కాంబో ఎపిసోడ్ ఈ నెల 13వ తేదీన స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. భోగి పండుగ కానుకగా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలో పవన్ హాజరైన ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.

ప్రభాస్ ఎపిసోడ్ లో చరణ్ కు కాల్ చేయడం ద్వారా బాలయ్య వీరసింహారెడ్డి మూవీకి ప్రమోషన్స్ చేయించుకున్నారు. పవన్ ఎపిసోడ్ లో కూడా బాలయ్య వీరసింహారెడ్డి గురించి పవన్ ద్వారా కూడా ఈ సినిమా ప్రమోషన్స్ చేయించుకోనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని ఆహా యాప్ నిర్వాహకుల నుంచి తెలుస్తోంది.

అన్ స్టాపబుల్ షో ద్వారానే బాలయ్య తన సినిమా ప్రమోషన్స్ ను చేసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. వీరసింహారెడ్డి సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ ఒపీనియన్ ఉండగా ఈ సినిమా ఏ మాత్రం సక్సెస్ సాధించినా బాలయ్య తర్వాత సినిమాలపై ఊహించని స్థాయిలో అంచనాలు నెలకొనే ఛాన్స్ అయితే ఉంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus