PSPK27 లీక్.. వీరమల్లు పవన్ వచ్చేశాడు!

  • February 26, 2021 / 10:15 AM IST

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నా అందులో అందరి చూపు ఎక్కువగా క్రిష్ సినిమాపైనే ఉంది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న బిగ్ బడ్జెట్ హిస్టారికల్ డ్రామాపై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వచ్చాయి. ఆ రూమర్స్ వల్లనే సినిమా రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ లాంటి హీరో గజదొంగనా లేక యోధుడా అని.. ఎన్నో సందేహాలు వస్తున్నాయి. ఇక ఫైనల్ గా సినిమాకు సంబంధించిన ఒక లుక్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.

సినిమా హిస్టారికల్ పిరియాడిక్ డ్రామాగా రానున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటి వచ్చింది. ఇక ఇప్పుడు పవన్ లుక్ చూశాక సినిమా ఈ కాలం నాటిది కాదని మరో క్లారిటీ వచ్చేసింది. చూస్తుంటే ఒక గజదొంగ లాంటి వీరుడిగా కనిపిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఈ సినిమా కోసం పవన్ ఫిట్నెస్ లో కూడా మార్పులు చేశాడు. సినిమా కోసం హరహర వీరమల్లు అనే టైటిల్ ను అనుకుంటున్న విషయం తెలిసిందే. ఇక టైటిల్ ఫస్ట్ లుక్ ను శివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్.ఎమ్.కీరవాణి మొదటిసారి పవన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండడం అంచనాల డోస్ ను అమాంతంగా పెంచేసింది. మరి ఆ దిగ్గజ టెక్నీషియన్ ఎలాంటి ట్యూన్స్ ఇస్తారో చూడాలి.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus