ఇటలీలోని టుస్కానీ నగరంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మెగా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లి కోసం మెగా, అల్లు, కామినేని, లావణ్య ఫ్యామిలీలు, పలువురు సన్నిహితులు ఇటలీకి చేరుకొని సందడి చేస్తున్నారు. నిన్న అక్టోబర్ 30 రాత్రి సంగీత్, కాక్ టైల్ పార్టీతో మెగా కుటుంబం అంత ఎంజాయ్ చేసింది. ఈ పార్టీలో నితిన్, నీరజ కోన వంటి ఇండస్ట్రీ స్టార్స్ కూడా హాజరయ్యారు.
ఆ పార్టీలో వరుణ్ లావణ్యతో పాటు అల్లు అర్జున్-స్నేహారెడ్డి, రామ్ చరణ్-ఉపాసన దంపతులు కలిసి దిగిన ఫోటోలు బయటకి వచ్చి నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇక నేడు హల్దీ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. ఆ పిక్స్ లో వరుణ్, లావణ్యతో పాటు చిరంజీవి, నాగబాబు దంపతులు కనిపిస్తున్నారు. ఇక ఈ ఫోటోలు చూసిన కొందరు పవన్ అభిమానులు తమ బాధని వ్యక్తం చేస్తున్నారు.
ఈ పెళ్లి వేడుకకు పవన్ కళ్యాణ్ కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కి సంబంధించిన ఒక ఫోటో కూడా బయటికి రాకపోవడంతో అభిమానులు బాగా ఫీల్ అవుతున్నారు. మెగా వెడ్డింగ్ నుంచి వస్తున్న ప్రతి ఫోటో కింద పవన్ అభిమానులంతా ఒకటే కామెంట్.. ‘పవన్ కళ్యాణ్ పిక్ ఉంటే పెట్టండి బ్రో’.అంటున్నారు. అయితే పవన్ అక్కడకు వెళ్లినా రాజకీయ పరమైన చర్చలు జరుపుతున్నారని టాక్. అందుకే ఆయన వేడుకల్లో పాల్గొనలేదని అంటున్నారు.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!