ఇది నిజమైతే పవన్ ఫ్యాన్స్ కు పెద్ద షాకే

  • February 13, 2023 / 12:00 AM IST

పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ‘ఓజి’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీ.. ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభమైంది.ఆర్.ఆర్.ఆర్ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.ఇదిలా ఉండగా.. తాజాగా ‘ఓజి’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్లో షికారు చేస్తుంది. ఈ మధ్యనే ఈ సినిమాలో విలన్ గా సునీల్ నటించబోతున్నట్టు కథనాలు వినిపించాయి.

అతనొక సీక్రెట్ మాఫియా డాన్ పాత్రలో కనిపిస్తాడు అని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా .. ఇప్పుడు ఈ మూవీ కథ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఓజి కథ గురించి ఇప్పటికే చాలా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇది తమిళ రీమేక్ అని .. పవన్ కళ్యాణ్ ఇందులో గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడు అని ప్రచారమైంది. అయితే ఇది ‘ఎంతవాడవు గాని’ రీమేక్ అంటూ ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది. అజిత్ హీరోగా నటించిన ఎన్నై అరిందాల్ చిత్రం తెలుగులో ఎంతవాడవు గాని పేరుతో డబ్ అయిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం సోసోగా ఆడింది. అయితే స్టార్ మా, స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్ వంటి ఛానల్ లలో ఈ మూవీ చాలా సార్లు టెలికాస్ట్ అయ్యింది. ఇంకో విచిత్రం ఏమిటంటే.. ఈ చిత్రాన్ని చిరు రీమేక్ చేయాలని ట్రై చేశారు. కానీ స్క్రిప్ట్ సెట్ అవ్వక వదిలేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సుజీత్ రీమేక్ చేయడమేంటో? అసలు ఇందులో నిజముందో లేదో తెలియాల్సి ఉంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus