పాయల్ రాజ్ పుత్ అస్సలు తగ్గడం లేదుగా…!

పాయల్ రాజ్ పుత్… పరిచయం అవసరం లేని పేరు. ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. గ్లామర్ షో మరియు రొమాంటిక్ సీన్ లకి ఏమాత్రం అడ్డు చెప్పకుండా గ్లామర్ ప్రియులని సైతం ఆకర్షించింది. అయితే తరువాత ఈమెకు వరుస ఆఫర్లు వచ్చి బిజీగా ఉంటుంది అనుకుంటే… అనుకున్నంత బిజీగా అయితే లేదు.

అందుకు కారణం ఈమెకు ఎక్కువగా అలాంటి పాత్రలే రావడం. మితి మీరిన లిప్ లాక్ లు, గ్లామర్ షో, రొమాన్స్ కు సంబంధించిన స్క్రిప్ట్ లే వస్తున్నాయి అని వాటిని పక్కన పెట్టేసింది. అటు తరువాత పారితోషికం కోసం అనుకుంట… ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ అనే మరో బోల్డ్ సినిమా చేసింది. అది కాస్తా అట్టర్ ప్లాప్ అయ్యింది అనుకోండి. ఇక ‘వెంకీమామ’ ‘డిస్కో రాజా’ వంటి క్రేజీ సినిమాల్లో నటించినా ఈమెకు కలిసి రాలేదు.

ఇదిలా ఉండగా.. లాక్ డౌన్ వల్ల ఈమెకు బోర్ కొడుతుందనుకుంట. మొన్నటికి మొన్న తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసిన ఈ బ్యూటీ అటు తర్వాత… పిల్లో అడ్డుపెట్టుకుని అర్ధ నగ్నంగా ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది. ఆ మాత్రం హాట్ సరిపోలేదు అనుకుందో ఏమో ఇప్పుడు ఏకంగా .. న్యూస్ పేపర్ అడ్డుపెట్టుకుని మరో సూపర్ హాట్ ఫోజ్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

1

2

3

4

5

6

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus