సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటో షూట్లకు సంబంధించిన ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ‘ఆర్.ఎక్స్.100’ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. అయితే ఈసారి ఓ డేరింగ్ స్టెప్ తీసుకుంది. మ్యాటర్ ఏంటి అంటే.. ఇటీవల ఓ అమ్మాయి బస్సులో ప్రయాణిస్తూ ఉండగా బహిష్టు కావడం.. దాని గురించి పక్కనే ఉన్న ఓ అబ్బాయి స్పందించిన తీరుకి సంబంధించి ఓ పోస్ట్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
దానికి సంబంధించిన ఫోటోనే ఇప్పుడు పాయల్ తన స్టోరీస్ లో జోడించింది. విషయంలోకి వెళితే.. ఓ తండ్రి తన కూతురికి ఎదురైన అబుభవాన్ని తెలుపుతూ ఈ పోస్ట్ ను పెట్టాడు. బస్సులో ప్రయాణిస్తున్న తన కూతురికి పీరియడ్స్(నెలసరి) జరిగాయి.అంటే ఊర్లల్లో పెద్ద మనిషి అయ్యింది అంటారు కదా అదన్న మాట. అయితే ఆ టైములో ఆ అమ్మాయి ప్యాంటు పై రక్తపు మరకలు ఏర్పడ్డాయి. అది గమనించిన ఓ అబ్బాయి ఆ విషయాన్ని ఆ అమ్మాయి చెవిలో చెప్పి..
తన స్వెటర్ ను ఆ అమ్మాయికి ఇచ్చి.. దానిని తన నడుముకి చుట్టుకొని ఇంటికి వెళ్ళమని చెప్పాడట. ఆ అబ్బాయిని అంత పద్దతిగా పెంచిన అతని తల్లిదండ్రులకు పెద్ద థాంక్స్ అంటూ ఈ ఫొటో పై రాసి ఉంది. దీనికి పాయల్ క్లాప్స్ కొడుతూ స్టోరీస్ లో జోడించింది. ఇంత డేర్ గా ఇలాంటి పోస్ట్ పెట్టినందుకు గాను నెటిజన్లు పాయల్ ను అభినందిస్తున్నారు.
Most Recommended Video
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!