Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Advertisement

‘పెద్ది’ అనే పేరు వింటేనే ఇది పక్కా మాస్‌ కమర్షియల్‌ సినిమా అని అర్థమైపోతుంది. అయితే బయటకు కనిపించే రా అండ్‌ రస్టిక్‌ లుక్‌, ఫీల్‌ వెనుక బరువైన కథ ఒకటి ఉంది అని సినిమా టీమ్‌ చెబుతూ వస్తోంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాశ్‌ కొల్లా కూడా కొన్ని కామెంట్లు చేశారు. వాటితోపాటు సినిమా సెట్స్‌ గురించి, లుక్‌ గురించి కూడా ఆయన మాట్లాడారు. దాదాపు మూడేళ్లు ఆయన ఈ సినిమాతో ట్రావెల్‌ చేశారట.

Peddi

‘పెద్ది’ సినిమా 1970-80ల మధ్య విజయనగరం బ్యాక్‌డ్రాప్‌ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఊళ్లలో పొలం గట్టుపై కూర్చొని క్రికెట్‌ చూస్తే ఎలాంటి ఫీలింగ్‌ కలుగుతుందో.. ఈ సినిమా చూసినా అదే ఫీలింగ్‌ కలుగుతుందని ఓ లెవల్‌ హైప్‌ ఇచ్చేశారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌కు ఏడాది అయింది అని తెలిపారు. సినిమా కోసం వేసిన ప్రతి సెట్‌కు మినియేచర్స్‌ను ముందుగానే సిద్ధం చేసుకున్నారట. ఓ ఊరి సెట్‌ వేయడం తన వరకు ఛాలెంజింగ్‌ అనిపించిందని అవినాశ్‌ తెలిపారు. అలాగే చెరకు ఫ్యాక్టరీ సెట్‌ కూడా బాగా కుదిరింది అని చెప్పారాయన.

సినిమా కోసం విజయనగరం వీధులు, క్లాక్‌ టవర్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్ని చూపించేలా సెట్స్‌కి తీర్చిదిద్దామని తెలిపారు. కొండపైన కనిపించే ఓ చిన్న పల్లెటూరు సెట్‌ ఈ సినిమాలో కీలకంగా ఉంటుందని తెలిపారు. అలా మొత్తంగా 24 సెట్స్‌ రూపొందించామని తెలిపారు. అవి మరో 70 హాఫ్‌ సెట్స్‌ కూడా వేశారట. ‘పెద్ది’ బ్యాట్‌, మైదానం, ట్రైన్‌ సెటప్ అన్నీ తన పనితనానికి సవాలు విసిరి చేపించుకున్నాయి అని చెప్పారాయన.

ఇక కొత్త సినిమాల గురించి చూస్తే.. అవినాశ్‌ కొల్ల నాని – శ్రీకాంత్ ఓదెల సినిమా ‘ది ప్యారడైజ్‌’, చిరంజీవి – బాబీ కొత్త సినిమాకు కూడా పని చేస్తున్నారు. నాని సినిమా ఇప్పటికే స్టార్ట్‌ అవ్వగా.. చిరంజీవి సినిమా త్వరలో ప్రారంభిస్తారు.

ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags