Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Advertisement

‘గేమ్ ఛేంజర్’ వంటి డిజాస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుండి రాబోతున్న చిత్రం ‘పెద్ది'(Peddi). మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి మార్చి 27 నే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

Peddi

కానీ ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ డేట్ కూడా కష్టంగానే ఉంది అంటూ ఇండస్ట్రీ కోడై కూస్తోంది. ఆల్రెడీ మే 1న ‘గాయపడ్డ సింహం’ అనే చిన్న సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుని ‘పెద్ది’ రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ రేపింది.

మరోవైపు జూన్ 25న ‘పెద్ది’ రిలీజ్ అవుతుందని తెలిసి తన సినిమాని(చెన్నై లవ్ స్టోరీ) వాయిదా వేస్తున్నట్టు ఎస్ కె ఎన్ తెలిపారు. కానీ ‘రాకాస’ ప్రమోషన్స్ లో రాంచరణ్ మాత్రం ‘పెద్ది’ ఆలస్యం అవ్వడం లేదు అంటూ చెప్పి ఇంకో షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతుందో అర్దంకాని పరిస్థితి. లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే  ‘పెద్ది’ వాయిదా పడటం దాదాపు ఖాయమైనట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన కారణాలు ఇంకా అధికారికంగా రావాల్సి ఉంది.

జూన్ 4 లేదా జూన్ 25న ‘పెద్ది’ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరగా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే..ఆ టైమ్..కి షెడ్యూల్ చేసుకున్న మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ కూడా మార్చుకోవాలి.

బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus