మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘పెద్ది'(Peddi). ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా విడుదలై ఇప్పుడు 3వ వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారం మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా.. రెండో వారంలో కూడా పోటీగా మరో పెద్ద సినిమా లేకపోవడంతో బాగానే క్యాష్ చేసుకుంది. అల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లోని బయ్యర్స్ అంతా సేఫ్ జోన్లోకి వచ్చేశారు.
కాకపోతే ఓవర్సీస్ లో, కర్నాటకలో అలాగే మిగతా భాషల్లో ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. కొద్దిపాటి వసూళ్లు రాబడుతూ వస్తున్నప్పటికీ.. తాజాగా రిలీజ్ అయిన సమంత ‘మా ఇంటి బంగారం’ దెబ్బకి అవి కూడా తగ్గిపోయినట్టు అయ్యాయి.ఒకసారి 16 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే
| నైజాం | 53.20 cr |
| సీడెడ్ | 21.40 cr |
| ఉత్తరాంధ్ర | 20.80 cr |
| ఈస్ట్ | 11.55 cr |
| వెస్ట్ | 8.28 cr |
| గుంటూరు | 10.54 cr |
| కృష్ణా | 9.30 cr |
| నెల్లూరు | 5.32 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 140.39 cr |
| కర్నాటక + తమిళ్+ హిందీ+ కేరళ | 30.28 cr |
| ఓవర్సీస్ | 20.36 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 191.03 cr(షేర్) |
‘పెద్ది’ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.225 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 16 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.191.03 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.341.9 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.33.97 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.