Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Advertisement

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెద్ది'(Peddi). ఇదొక పీరియాడిక్ స్పొర్ట్స్ డ్రామా. ‘వ్రిద్ది సినిమాస్’ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించగా సుకుమార్, నవీన్ యెర్నేని, వై.రవి శంకర్..లు సమర్పకులుగా వ్యవహరించారు. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. జూన్ 3 రాత్రి నుండే ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి.

Peddi

వాటికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కి ప్రశంసల వర్షం కురుస్తుంది. క్లైమాక్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. మొదటి రోజు ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు వర్కింగ్ డే కారణంగా కొంచెం డౌన్ అయినా పర్వాలేదు అనిపించాయి. కానీ శనివారం రోజున గ్రోత్ చూపించింది. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 33.55 cr
సీడెడ్ 13.18 cr
ఉత్తరాంధ్ర 10.51 cr
ఈస్ట్ 6.90 cr
వెస్ట్ 4.88 cr
గుంటూరు 7.04 cr
కృష్ణా 5.41 cr
నెల్లూరు 3.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 84.57 cr
కర్నాటక + తమిళ్+ హిందీ+ కేరళ 16.79 cr
ఓవర్సీస్ 16 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 117.36 cr(షేర్)

‘పెద్ది’ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.225 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.117.36 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.204.15 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.107.64 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus