Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Advertisement

‘పెద్ది’ సినిమా రిలీజ్‌ డేట్‌ ఏది? అంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో, టాలీవుడ్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానికి కారణం సినిమా రిలీజ్ మంత్‌ను ప్రకటించిన సినిమా టీమ్‌, డేట్‌ని మాత్రం చెప్పలేదు. దీంతో సినిమా టీమ్‌ని ఓ లెవల్‌లో ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్‌ డేట్‌ని చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా అధికారికరంగా ప్రకటించారు. దీంతో రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ హ్యాపీగానే ఉన్నా.. ఎక్కడో చిన్న డౌట్‌ అలానే ఉండిపోయింది. ఎందుకంటే ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా అని.

Buchi Babu

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు సానా – జాన్వీ కపూర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘పెద్ది’. మార్చి నెలాఖరున రావాల్సిన సినిమాను తొలుత ఏప్రిల్‌ నెలాఖరుకు వాయిదా వేశారు. ఇప్పుడు ఏకంగా సినిమాను జూన్‌ నెలాఖరకు వాయిదా వేశారు. అవును జూన్‌ 25న సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు ప్రకటించారు. ధనుష్‌ కొత్త సినిమా ‘కర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన బుచ్చిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పెద్ది’ సినిమా అప్‌డేట్‌ని కూడా షేర్‌ చేసుకున్నారు.

సినిమాకు సంబంధించి ఇన్నాళ్లూ పెండింగ్‌ అని చెబుతున్న ఐటెమ్‌ సాంగ్‌ షూటింగ్ జరుగుతోందని చెప్పారు. జూన్‌ 25న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని కూడా తెలిపారు. దీంతో గత కొన్ని రోజులుగా ‘పెద్ది’ సినిమా విడుదల తేదీపై ఉన్న గందరగోళం తొలగిపోయినట్లు అయింది. అంటే సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలు ఉంది. మామూలుగా అయితే పోస్ట్ ప్రొడక్షన్‌, ప్రచారానికి ఈ సమయం సరిపోతుంది. కాస్త ప్యాచ్‌ వర్క్‌ ఉన్నా చేసేసుకోవచ్చు. మరి ఈసారైనా టీమ్‌ చెప్పిన సమయానికి రిలీజ్‌ చేస్తారా అనేది చూడాలి.

అన్నట్లు ఈ డేట్ కొత్తదేం కాదు. కొన్ని రోజుల క్రితమే మరో నిర్మాత ఎస్‌కేఎన్‌ ఈ డేట్‌ చెప్పారు. వేరే సినిమా గురించి చెబుతూ ఆయన ‘పెద్ది’ గురించి మాట్లాడటంతోనే ‘పెద్ది’ వాయిదా విషయం బయటకు వచ్చింది. అంటే ఈ డేట్‌ ఎప్పుడో చాలా రోజుల క్రితమే అనుకున్నారన్నమాట.

ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus