‘గురూజీ’ అంటూ చురకలు అంటించిన పూనమ్..!

  • June 17, 2020 / 05:25 PM IST

ఫేడౌట్ అయిపోయిన హీరోయిన్లు ఎంతో మంది ఏదో ఒక అవకాశం వస్తుంది కదా.. సోషల్ మీడియాలో వారి లేటెస్ట్ పిక్స్ ను లేదా గ్లామర్ పిక్స్ .. ఇంకా కాదు అంటే హాట్ పిక్స్ ను పెడుతుంటారు. కొంతవరకూ ఇవి వర్కౌట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మరింకొంత మంది మాత్రం.. పెద్ద వాళ్ళ పై సెటైర్లు వేసి నిత్యం ఏదో ఒక వార్తల్లో ఉంటారు. అలా కూడా ‘క్రేజ్ సంపాదించుకోవచ్చు, ట్రెండింగ్లో ఉండొచ్చు.. అవకాశాలు కొట్టెయ్యొచ్చు’ అనేది వారి స్కెచ్ కావచ్చు. బహుసా ఈ లిస్టులోనే ఉంటుందేమో పూనమ్ కౌర్.

గతంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ.. అయితే అవేమీ హిట్లు కాలేదు.తరువాత గోపీచంద్ ‘శౌర్యం’ వంటి హిట్ సినిమాలో చెల్లి పాత్ర కూడా పోషించింది. అయినా ఈ అమ్మడికి కలిసి రాలేదు. ‘ఈమె మొహంలో మంచి కళ ఉంటుంది. హీరోయిన్ మెటీరియల్’ అని అప్పట్లో కుర్రకారు ప్రశంసించే వారు. అయినప్పటికీ ఈమెకు కలిసొచ్చిందేమీ లేదు. ఇదిలా ఉంటే.. గతంలో పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేస్తూ పాపులర్ అయ్యింది పూనం. నిత్యం ఏదో ఒక అంశం పై తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూనే ఉంటుంది. అలాంటి పూనమ్ తాజాగా ‘గురూజీ’ అంటూ కొన్ని ట్వీట్లు వేసింది.

‘తనతో రిలేషన్ మెయిన్టైన్ చేసిన ఓ స్టార్ డైరెక్టర్ నేను ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉంటే.. ‘నువ్వు చస్తే ఒక్క రోజు న్యూస్ లో ఉంటావు’ అన్నాడంటూ పేర్కొంది. అక్కడితో ఆగలేదు.. ‘తెలుగు హీరోయిన్ సావిత్రి గొప్పతనం గురించి స్టేజి పై మాట్లాడే నువ్వు.. ఒక్క తెలుగామ్మయిని కూడా అవకాశం ఇవ్వవు. అందంగా ఉంది అని కుర్రకారు మెచ్చిన నన్ను కూడా సినిమా నుండీ తొలగించావ్. నీకు నచ్చిన వాళ్ళకే అవకాశాలు ఇస్తావ్. భజన చెయ్యడం తప్ప నువ్వు చేసేది ఏమీ ఉండదు’ అంటూ ఘాటుగా కామెంట్స్ చేసి “#Guruji” అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టింది పూనమ్.ఈమె ఏ స్టార్ డైరెక్టర్ ను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసిందో మీకు ప్రత్యేక్కంగా చెప్పనక్కర్లేదు.

1

2

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus