Poonam Pandey: పూనమ్.. బోల్డ్ కామెంట్స్ కి నెటిజన్లు ఫిదా..!

చెప్పుకోవడానికి బాలీవుడ్ హీరోయినే.. అయినప్పటికీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ దేశం మొత్తాన్ని పలకరిస్తుంటుంది పూనమ్ పాండే. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలతో కుర్ర కారుకి నిద్రలేకుండా చేయడం ఈమె స్పెషాలిటీ.! అక్కడి వరకు పర్వాలేదు.. కానీ వివాదాల్లో కూడా నిలుస్తూ హాట్ టాపిక్ అవుతుంటుంది ఈ అమ్మడు. గతేడాది ఈమెను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.లాక్ డౌన్ అమలులో ఉండగా..ముంబై రోడ్లపై షికార్లు కొడుతూ.. కొడుతూ పోలీసులకు చిక్కింది.

అంతేకాదు ఓసారి కారులో నగ్నంగా ఫోటో షూట్లో పాల్గొన్నందుకు కూడా ఈ అమ్మడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయినప్పటికీ ఈ అమ్మడు అస్సలు తగ్గదు. సరే ఇక అసలు విషయం ఏంటంటే..కొద్దిరోజులుగా పూనమ్ పాండే తల్లి కాబోతుందని మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న పూనమ్ పాండే వెంటనే తన సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. ‘నన్ను తల్లిని చేసింది మీడియా,సోషల్ మీడియా.!

కానీ.. నన్ను తల్లిని చెయ్యాల్సింది నా పార్ట్నర్ కదా?’ అంటూ వెరైటీగా స్పందించి ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది ఈ అమ్మడు.గత ఏడాది అంటే.. 2020 సెప్టెంబర్ 1న ఈ అమ్మడు తన బాయ్ ఫ్రెండ్ అయిన సామ్ బాంబేని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని ఆమె నివాసంలో కొద్ది పాటి బంధుమిత్రుల సమక్షంలో చాలా నిరాడంబరంగా.. పూనమ్ పాండే వివాహం జరిగింది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus