డిసెంబరులో రెండంటే రెండే హిట్లు.. పూర్‌ రిజల్ట్‌ కదా!

సినిమాకు స్టార్టింగ్‌, ఎండింగ్‌ అదిరిపోవాలి అని అంటుంటారు. అలా 2022ని కూడా ఓ సినిమాగా తీసుకుంటే.. సినిమాకు ఓపెనింగ్‌ అంతంతమాత్రమే.. ఇప్పుడు ఎండింగ్‌ కూడా అంతంతమాత్రంగానే ఉంది. జనవరిలో ఏం జరిగింది అనేది వదిలేద్దాం.. డిసెంబరు లెక్క చూద్దాం మీకే క్లారిటీ వచ్చేస్తుంది. డిసెంబరులో టాలీవుడ్‌లో వచ్చిన సినిమాల్లో ఒకటి తప్ప అన్నీ తుస్‌మన్నాయి అంటే నమ్ముతారా? ఆ హిట్‌ సినిమా కూడా కాదు కాదు అంటూనే అయ్యింది. దీనికి ఓ డబ్బింగ్‌ సినిమా తోడుగా వచ్చింది.

అలా 2022 ఆఖరి నెల డిసెంబరు సినిమాల విభాగంలో రెండు విజయాలతో ముగించింది. అలా అని ఏమన్నా తక్కువ సినిమాలు వచ్చాయా అంటే లేదనే చెప్పాలి. ప్రతి వారం పదికి పైగా సినిమాలు విడుదలయ్యాయి ఈ నెలలో. అందులో కాస్త గుర్తింపు ఉన్నవి ఇంచుమించు ఐదు ఉంటాయి. అలా ఆఖరి వారంలో కూడా బాగానే సినిమాలొచ్చాయి. కానీ వాటి బాగోగులే బాగాలేవు. థియేటర్లకు జనాల్ని రప్పించడంలో విఫలమయ్యాయి. కొత్త ఏడాదిలో సినిమాలు చూడొచ్చులే అని అభిమానులు థియేటర్లవైపు చూడలేదు అని అనొచ్చు.

ఈ వారం బాక్సాఫీసు ద‌గ్గ‌ర‌కి ఆది ‘టాప్ గేర్‌’, రాజ‌యోగం, సోహైల్‌ ‘ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌’ లాంటి ఐదారు సినిమాలు విడుద‌ల‌య్యాయి. వాటిలో ఒక్క‌దానికీ మంచి ఓపెనింగ్స్ రాలేదు. భారీ ప్రచారంతో వచ్చిన చిన్న సినిమా ‘కొర‌మీను’ కూడా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. దీంతో 2022లో చివ‌రి వారం బాక్సాఫీసుకి చేదు అనుభ‌వాల‌నే అందించింది అని చెప్పాలి. నిజానికి డిసెంబ‌రులో సినిమాల్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు పెద్దగా ఇష్ట‌ప‌డ‌రు.

సంక్రాంతి సీజ‌న్‌లో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు అనుకుంటారు అని అంటుంటారు. అయితే కొన్నేళ్లుగా డిసెంబరులో కూడా సినిమాలు వస్తున్నాయి, భారీ విజయాలు సాధిస్తున్నాయి. అలా గతేడాది ‘అఖండ’, ‘పుష్ప’ వచ్చి భారీ విజయాలు అందుకున్నారు. కానీ ఏడాది కేవలం రవితేజ ‘ధమాకా’ మాత్రమే డిసెంబరులో అదరగొట్టింది. దీనికి జేమ్స్‌ కామెరూన్‌ ‘అవతార్‌ 2’ విజయం యాడ్‌ ఆన్‌. అలా 2022 రవితేజ, కామెరూన్‌దే అని చెప్పాలి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus