Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు పోసాని!

సినిమా ఇండస్ట్రీలో నటుడిగా రచయితగా దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం రాజకీయాలలో కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతుగా ఉండడంతో తరచూ పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ ఉంటారు. ఇక గత కొద్దిరోజుల క్రితం ఈయన మెగా ఫ్యామిలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఎంత వివాదంగా మారిందో మనకు తెలిసిందే.

ఇలా పవన్ కళ్యాణ్ గురించి మెగా ఫ్యామిలీ గురించి పోసాని సంచలన వ్యాఖ్యలు చేసి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఈయన పవన్ కళ్యాణ్ పై ఎక్కడ లేని ప్రేమను వలకబోసారు. ఇలా పోసాని పవన్ కళ్యాణ్ గురించి ప్రేమగా మాట్లాడుతూ తనపై ప్రశంసలు కురిపించడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా పోసాని పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు అంటూ ప్రశంసలు కురిపించారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన అన్నయ్య చిరంజీవి కన్నా చాలా మంచివాడు అంటూ ప్రశంసలు కురిపించడంతో బహుశా పోసానికి సినిమా అవకాశాలు రాలేదేమో అవకాశాల కోసమే ఇలా మెగా ఫ్యామిలీ భజన చేస్తున్నారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే గతంలో మీరు మెగా ఫ్యామిలీ గురించి చేసిన వ్యాఖ్యల వల్ల మీరు ఎఫెక్ట్ అయ్యారా అనీ ప్రశ్నించడంతో అవును తనకు ఎఫెక్ట్ అయిందని సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ వల్ల నా కెరియర్ నాశనమైంది అనే విషయం పక్కన పెడితే ఆయన చాలా మంచివాడు.

ఇక 60 సంవత్సరాల వయసులో నాకు ఎలాంటి పాత్రలు వస్తాయి. పవన్ నా కెరియర్ ఆపేసిన నాకు వచ్చిన నష్టం ఏమాత్రం లేదని కేవలం అవకాశాల కోసం మాత్రమే తనని పొగడడం లేదని పోసాని తెలిపారు.అయితే పవన్ కళ్యాణ్ ఇంత సడన్ గా పొగడడానికి కారణం ఏమి లేదు. చంద్రబాబు నాయుడుతో పోలిస్తే పవన్ కళ్యాణ్ చాలా మంచివారు. ఇలా ఎంతో మంచిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చేరి ఇలా రాజకీయాలు చేయడం అవసరమా అన్న ఉద్దేశంతో తాను మాట్లాడానని ఈ సందర్భంగా పోసాని పవన్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus