Posani, Pawan: వైరల్ అవుతున్న పోసాని కృష్ణమురళి షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన పోసాని కృష్ణమురళి ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాలలో కనిపించడం లేదనే సంగతి తెలిసిందే. పోసాని ప్రస్తుతం వైసీపీలో ఉండగా జనసేనపై విమర్శలు చేసే విషయంలో పోసాని ముందువరసలో ఉంటారు. అయితే పోసాని కృష్ణమురళి తాజాగా పవన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అదే సమయంలో పవన్ కాళ్లు మొక్కుతానని ఆయన చెప్పుకొచ్చారు. ముద్రగడ పద్మనాభం లంచం తీసుకున్నాడు అంటే నేను వచ్చి పవన్ కాళ్లకు దండం పెడతానని నా మాటలన్నీ వెనక్కు తీసుకుంటానని పోసాని వెల్లడించారు.

పోసాని (Posani Krishna Murali ) చేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. పోసాని కృష్ణమురళి కామెంట్లపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. పోసాని, పవన్ మధ్య వేర్వేరు పార్టీలలో ఉండటం వల్లే సమస్యలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బ్రో మూవీతో మరో నెల రోజుల్లో పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారనే సంగతి తెలిసిందే.

సినిమా సినిమాకు పవన్ క్రేజ్ పెరుగుతుండగా ఇతర హీరోలకు భిన్నంగా పవన్ కెరీర్ విషయంలో అడుగులు వేస్తున్నారు. వేగంగా సినిమాల్లో నటించడానికి పవన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ హాజరు కాకున్నా ఓజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సీజీ వర్క్ కు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ వరుస విజయాలను సొంతం చేసుకుని కెరీర్ పరంగా మరింత ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పవన్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus