Prabhas: స్పీడ్ పెంచిన వంగా.. ప్రభాస్ కోసం డైరెక్ట్ గా సెట్స్ లోకి వెళ్లి..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అద్భుతమైన ప్రాజెక్టులతో తన క్యాలెండర్‌ని పూర్తిగా ఫుల్ చేసుకున్నారు. రీసెంట్‌గా రాజా సాబ్ (The Raja Saab) సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. మేకర్స్ మే 30న సినిమా విడుదల చేయాలని అనుకున్నా, షూటింగ్ లేదా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా అక్టోబర్‌కి వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, రాజా సాబ్ తర్వాత ప్రభాస్ (Prabhas) ఇక గ్యాప్ తీసుకోకుండా వరుసగా మిగతా ప్రాజెక్టులపై దృష్టిపెట్టనున్నారు.

Prabhas

ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) హాను రాఘవపూడి (Hanu Raghavapudi)  దర్శకత్వంలో ఒక వార్ యాక్షన్ లవ్ డ్రామాలో నటిస్తున్నారు. 1940 బ్యాక్‌డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీకి చెందిన సోల్జర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. భారీ ఎమోషనల్ డ్రామా, యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాలో కొత్త నటి ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీ లొకేషన్లలో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూళ్లు జరుగుతుండటంతో ప్రభాస్ ఫుల్ బిజీ అయ్యారు.

ఇప్పటికే రాజా సాబ్, హాను మూవీ షూటింగ్‌లను ఏకకాలంలో బ్యాలెన్స్ చేస్తూనే, మరోవైపు స్పిరిట్ (Spirit)  ప్రాజెక్ట్ కోసం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)    ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తున్నారు. తాజాగా, సందీప్ ప్రభాస్‌ను అల్యూమినియం ఫ్యాక్టరీలో కలవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమావేశంలో సినిమా షూటింగ్ షెడ్యూల్, లుక్ టెస్ట్ వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారని దర్శకుడు ఇదివరకే స్పష్టంగా తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ప్రభాస్ కెరెక్టర్‌కు చుట్టూ తిరిగేలా ఉండబోతుందని అంటున్నారు. మే లేదా జూన్‌లో షూటింగ్ ప్రారంభించి, ఎలాంటి విరామం లేకుండా పూర్తి చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ప్రభాస్ చేతిలో మూడు భారీ బడ్జెట్ చిత్రాలు ఉండటంతో, ఒక్కో సినిమా మరొకదానికంటే భారీ స్థాయిలో రూపొందుతున్నాయి.

వెంకటేష్ కూడా రెమ్యునరేషన్ పెంచే టైమొచ్చింది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus