ఓ సినిమా భారీ విజయం అందుకున్నాక అందులోని చిన్న చిన్న లూప్ పాయింట్స్, క్లారిటీ మిస్ అయిన అంశాలు, డైలాగ్‌లు ఇలా ఏవీ గుర్తుకు రావు అంటారు. గతంలో చాలా సినిమాలు ఇలా ఆ విషయాల్ని లైట్ తీసుకునేలా చేశాయి. అలా ‘సలార్’ వచ్చినప్పుడు కూడా కొన్ని విషయాల్ని అభిమానులు, ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. వాటిలో ఒకటి ప్రభాస్ యాక్షన్ సీన్స్‌లో మూమెంట్ లేకపోవడం, రెండోది డైలాగ్‌లు లేకపోవడం. వాటిని ఓటీటీలోకి సినిమా వచ్చాక పాయింట్ అవుట్ చేస్తున్నారు.
థియేటర్లలో ‘సలార్’ సినిమా జోరు ఇలా తగ్గిందో లేదో, అలా ఓటీటీలోకి తీసుకొచ్చి ఆ ఫీవర్‌ను కంటిన్యూ చేస్తున్నారు అయితే నెటిజన్లు సినిమాను పాయింట్ టు పాయింట్ పట్టుకుని అనలైజ్ చేస్తున్నారు. అలా ఓ నెటిజన్ సినిమాలో ప్రభాస్ డైలాగ్స్ అన్నీ ఒక వీడియోలో పొందుపరిచాడు. మొత్తంగా చూస్తే ప్రభాస్ ఈ సినిమాలో పట్టుమని మూడు నిమిషాలు కూడా మాట్లాడలేదు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నిజాఇకి ప్రభాస్ ఈ సినిమాలో చెప్పిన మొత్తం సంభాషణల నిడివి దాదాపు నాలుగు నిమిషాలు. అయితే అందులోని పదాల మధ్య పాజ్‌ను కట్ చేసేస్తే ఆ నిడివి 2:35 నిమిషాలు వచ్చింది. దీంతో ఓ హీరో అందులోనూ మాస్ హీరో ఇంత తక్కువసేపు మాట్లాడటమా అని హవ్వ అనుకుంటున్నారు నెటిజన్లు. సినిమాలో అంటే ఎలివేషన్ సీన్లు, ఖాన్సార్ సామ్రాజ్యం హంగుల మధ్యలో తెలియలేదు కానీ… ఓటీటీలో పక్కాగా తెలుస్తోంది అని చెప్పాలి.
అయితే ఇందులో ప్రభాస్ (Prabhas) చెప్పిన పెద్ద డైలాగ్‌లు అంటే ఒకటి కాటేరమ్మ సీన్లో, రెండోది పృథ్వీరాజ్ సుకుమారన్‌తో వచ్చే సన్నివేశాల్లో మాత్రమే. అంతే కాదు సినిమాలో ఇతర కీలక పాత్రధారులైన శ్రియ రెడ్డి, టినూ ఆనంద్, దేవరాజ్, బ్రహ్మాజీ లాంటివారితో ప్రభాస్‌కు ఒక్క డైలాగ్ కూడా లేకోవడం గమనార్హం. పృథ్విరాజ్ తర్వాత డార్లింగ్ కాస్త మాట్లాడింది అంటే ఈశ్వరిరావుతోనే అని చెప్పాలి.
Prabhas Dialogue time in Salaar (sped up)
Roughly 4 minutes with dialogue gaps and 2:35 min without gaps… https://t.co/aHPhd30Mp5 pic.twitter.com/bxTclXjMcA— Lok (@TeluguOchu) January 21, 2024
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!